New Railway Line: తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. హైదరాబాద్- విజయవాడ తగ్గనున్న ప్రయాణ సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Railway Line: ప్రయాణికులకు రైల్వే శాక శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మొదలుకానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్నందున రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. ఖమ్మం జిల్లా మోటమర్రి, నల్గొండ జిల్లా విష్ణుపురం మధ్య 88.81 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1,746.40 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది.
Read also: Isha Ambani : టుట్టి ఫ్రూటీ, పాన్ పసంద్ అమ్మే కంపెనీని కొనుగోలు చేయనున్న ఇషా అంబానీ
Also Read
నల్గొండ జిల్లా విష్ణుపురం నుంచి ఖమ్మం జిల్లా మోటుమర్రి వరకు రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో ప్రయాణికులను చేరవేసే రైళ్లకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం విష్ణుపురం నుంచి మోటుమర్రి వరకు గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో రెండో రైలు మార్గాన్ని నిర్మించి ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రయాణికులు (కొన్ని రైళ్లు) హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి గుంటూరు వెళ్లి విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది.
సికింద్రాబాద్ నుంచి 313 కి.మీ దూరం ఉండగా, బీబీనగర్-గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండడంతో ప్రయాణికులు రైలులో ప్రయాణించాలంటే దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం మోటుమర్రి మార్గంలో రెండో లైన్ ఏర్పాటు చేస్తే గుంటూరు వెళ్లకుండా నేరుగా విజయవాడ చేరుకోవచ్చు. దాదాపు 50 కి.మీ దూరం తగ్గించి గంట సమయం ఆదా చేసుకునే అవకాశం ఉంది. 2011లో సిమెంట్ పరిశ్రమల వాణిజ్య అవసరాల కోసం విష్ణుపురం నుంచి మోటుమర్రి మార్గం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 24 గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి. ప్రస్తుతం సిమెంట్, ఇనుము, బియ్యం రవాణా చేస్తున్నారు.
Chelluboina Venugopala Krishna: ఆ పార్టీలో ఆశయం ఎక్కడా కనిపించడంలేదు..!
తాజావార్తలు
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!