బనగానపల్లెలో టిడిపి, వైసిపి పోరు పొగలు సెగలు రేపుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరస్పర ఆరోపణలు ఒకవైపు, కాటసాని అనుచరుడి కిడ్నాప్, మరో అనుచరునిపై దాడి ఘటనలతో పరిస్థితి చేయిదాటి పోయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయట. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళి ఆచారి పై టిడిపి కార్యకర్తలు…
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో షాదీఖానా చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కోవెలకుంట్ల పట్టణంలో షాదీఖానా విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి జరుగుతోంది. షాదీఖానా పేరుతో మభ్యపెట్టి, కమ్యూనిటీ హాల్ నిర్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బీసీ జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్ధతుగా ఇతర పార్టీల నుంచి వలసలు షురూ అయ్యాయి. తాజాగా కొలిమిగుండ్లలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఈరోజు (ఆదివారం) బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ కీలక నేత, కొలిమిగుండ్ల పట్టణ ఉపసర్పంచ్ పెద్ద నాగయ్య ఆధ్వర్యంలో గిత్తన్న గారి నాగేశ్వరావు, కుళ్ళే నాగకుళాయి, తలారి శ్రీనివాసులు, తలారి చెన్నకేశవ, తలారి చంద్రగోపాల్,…
ఎన్నికలకు ముందు నంద్యాల జిల్లా బనగానపల్లె నరియోజకవర్గంలో నివురుగప్పిన నిస్పులా సెగలు కక్కుతున్న రాజకీయం ఇప్పుడు మంటలు పుట్టిస్తొంది.. షాదీఖానా నిర్మాణం విషయంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి మద్య జరుగుతున్న వార్ పీక్స్‌కు చేరింది.