Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another Cyclone: ఒకవైపు ‘అర్నబ్’ తుఫాన్ విధ్వంసం ఇంకా ముగియకముందే, బంగాళాఖాతంలో మరో పెనుముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు తీర ప్రాంత ప్రజలను కలవరపెడుతున్నాయి. ఏపీని ఒక్కసారిగా కుదిపేసిన అర్నబ్ తుఫాన్ ఎట్టకేలకు కోనసీమ మీదుగా తీరం దాటింది. గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గాలి ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ తుఫాను తీరం దాటే సమయానికి కొంత బలహీనపడినప్పటికీ, దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ దీనిపై ఎప్పకపుడు నిఘా పెట్టి పరిస్థితిని సమీక్షిస్తోంది. అయితే, ఈ గండం గడవకముందే మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోందని వాతావరణ నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. అక్టోబర్ 27 నాటికి బంగాళాఖాతంలో రెండు సిస్టమ్‌లు చురుగ్గా ఉన్నాయి. ఒకవైపు అర్నబ్ ఉంటే, మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అర్నబ్ ప్రభావం తగ్గిన వెంటనే.. నవంబర్ 1-2 తేదీల మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, అది ఒడిశా తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని ఈసీఎండబ్ల్యూఎఫ్, ఐఎండీ జీఎఫ్ఎస్ వంటి కొన్ని వాతావరణ నమూనాలు హెచ్చరిస్తున్నాయి.
కాగా, వాతావరణ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నందున అన్ని మోడల్స్ ఒకే అంచనాకు రాలేవు. గతంలో అర్నబ్ తీరం దాటే సమయాన్ని అంచనా వేయడంలో కొన్ని తప్పులు జరిగాయి. అందుకే, ఐఎండీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కొత్త తుఫాను హెచ్చరిక జారీ చేయలేదు. ప్రస్తుతానికి అర్నబ్ కదలికలపైనే వాతావరణ శాఖ ప్రధానంగా దృష్టి సారించింది. ఒకవేళ ఈ కొత్త తుఫాను కనుక నిజంగా రూపుదిద్దుకుంటే, ఒడిశా తీర ప్రాంత జిల్లాలకు మరోసారి భారీ వర్షాలు, ఈదురుగాలుల ముప్పు తప్పదు. ఇప్పటికే అర్నబ్ కారణంగా దక్షిణ ఒడిశాలో ప్రభావం కనిపిస్తోంది. ఇలా వరుసగా రెండు తుఫానులు వస్తే వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంది, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది, అంతేకాక సహాయక చర్యలపై కూడా తీవ్ర ఒత్తిడి పడుతుంది. అందుకే అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Also Read
అయితే, ఈ కొత్త తుఫాను ఏర్పడటం ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు కాబట్టి ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ‘అర్నబ్’ తుఫాను ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడటమే ప్రధాన కర్తవ్యం. తుఫాను తీరం దాటి పూర్తిగా బలహీనపడిన తర్వాతే రెండో తుఫానుపై స్పష్టత వస్తుంది. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, కేవలం ఐఎండీ అందించే సూచనలను మాత్రమే పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బంగాళాఖాతంలో మారుతున్న ఈ వాతావరణ పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కొనేందుకు మన తీర ప్రాంత రాష్ట్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని మరోసారి గుర్తు చేస్తున్నాయి.
Double trouble in the Bay of Bengal after Cyclone Arnab?
As Arnab approaches Andhra Pradesh ahead of its expected October 28 landfall, the US Navy’s JTWC estimates sustained winds of 213km/h, against the IMD’s reported peak of 150–160km/h. The agencies use different wind-speed averaging methods.
Meanwhile, weather models suggest another cyclone could develop and head towards Odisha around November 1–2, although experts caution that its formation remains uncertain, reports @bluewrit
Read more ➡️ https://t.co/0mUjhCs6EO
#CycloneArnab #BayOfBengal #Odisha #ExtremeWeather
— Down To Earth (@down2earthindia) October 27, 2026
తాజావార్తలు
-
Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
-
Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
-
Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!