Site icon NTV Telugu

Chhattisgarh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. బస్తర్‌ను నక్సల్ రహితంగా ప్రకటన..

Naxalites

Naxalites

ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాను నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా (LWE – లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) నుంచి తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి, ముఖ్యంగా బస్తర్‌కు ఒక చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది. గత కొన్ని ఏళ్లుగా భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా బస్తర్‌లో నక్సలైట్ల ఏరివేత సమర్థవంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం శాంతి పునరుద్ధరించబడింది.

READ MORE: YS Avinash Reddy: కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు..

ప్రస్తుతం బస్తర్ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నక్సలిజాన్ని రూపు మాపేందుకు సహాయపడ్డాయి. రోడ్డు నిర్మాణం, విద్య, ఆరోగ్య సేవలు, పరిపాలన క్రియాశీలత బస్తర్‌ను నక్సలిజం నుంచి బయటకు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం జాబితా నుంచి ఈ జిల్లా పేరును తొలగించడంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఇది బస్తర్ ఇమేజ్‌ను మార్చడమే కాకుండా, ఉపాధి, పర్యాటక అవకాశాలను కూడా పెంచుతుంది. ఈ నిర్ణయం బస్తర్ ప్రజలకు గర్వకారణమని, రాబోయే కాలంలో శాశ్వత శాంతి, పురోగతి వైపు సాధిస్తుందని భావిస్తున్నారు.

READ MORE: Neha Bhandari: బార్డర్‌లో పాక్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన వీర వనిత..

కాగా.. గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రాంతం గురించి ప్రస్తావించారు. “బస్తర్‌లో బుల్లెట్లు, బాంబులు పేల్చిన రోజులు పోయాయి. నక్సలైట్ సోదరులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని నేను కోరుతున్నాను. మీరు మా సొంత ప్రజలు. ఒక నక్సలైట్ చనిపోతే ఎవరూ సంతోషంగా ఉండరు. ఆయుధాలు పట్టడం ద్వారా మీరు మీ గిరిజన సోదరులు, సోదరీమణుల అభివృద్ధిని ఆపలేరు. అభివృద్ధి ప్రక్రియలో భాగమైన లొంగిపోయిన నక్సలైట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి అవసర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదేళ్లలో బస్తర్‌కు అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. బస్తర్ 50 సంవత్సరాలుగా అభివృద్ధిని చూడలేదు. కానీ- పిల్లలు పాఠశాలకు వెళ్లినప్పుడు, మండల్లలో ఆరోగ్య సౌకర్యాలు ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్య బీమా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అయితే ఇది బస్తర్ ప్రజలు వారి ఇళ్లను, గ్రామాలను నక్సలైట్ రహితంగా మార్చాలని నిర్ణయించుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది” అని అమిత్‌ షా పేర్కొన్నారు.

Exit mobile version