బర్రెలక్క (కర్నె శిరీష) అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. హాయ్ ఫ్రెండ్స్.. అంటూ చేసిన ఒకే ఒక్క రీల్ ఆమెను సోషల్ మీడియా సెన్షేషన్‌ను చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనను రేకెత్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల గొంతుకగా ఆమె.. నాగర్‌కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ప్రచారంలో దూకుడుగా వ్యవహరించి.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అయితే ఫలితాల్లో మాత్రం వెనకబడింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆమెకు దాదాపు 5 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎంపీగా పోటీ చేసి కూడా ఓటమి పాలైంది.
READ MORE: Minister Savitha: చంద్రబాబు పాలన చేనేతలకు స్వర్ణయుగం లాంటిది..
తాజాగా మరోసారి బర్రెలక్క వీడియో వైరల్ అవుతోంది. తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఆవేదన వ్యక్తం చేసిందింది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి తనపై ట్రోల్స్ వస్తున్నాయని, తన పెళ్లిపైనా ట్రోల్స్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. నేను చేసిన తప్పేంటని ప్రశ్నిస్తూ బోరున ఏడ్చేసింది.
READ MORE: World Asthma Day 2025: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఆస్తమా కావచ్చు.. జాగ్రత్త సుమీ!
“ముక్కుమొఖం తెలియని వ్యక్తులు కూడా నా ఫ్రెండ్ అని నాపేరు చెప్పుకుని మోసం చేశారు. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే అందరూ ఇలాగే ట్రోల్స్ చేసి నా జీవితాన్ని నాశనం చేస్తారని నేను పెళ్లి చేసుకున్న. పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండే. ఒక సంవత్సరం ఆగుదాం అనుకున్నాం. ఇంకా ఎన్నిరకాలుగా బ్లేమ్ చేస్తారో అని బయపడి పెళ్లి చేసుకున్నాం. ఈ రోజు వరకు కూడా పెళ్లైన సంతోషం లేకుండా ట్రోల్స్ చేసి మానసికంగా నన్ను చాలా బాధపెడుతున్నారు. అన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు. నేను ఎవ్వరినీ ఏం అనను. కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు.” అని వీడియోలో బర్రెలక్క ఆవేదన వ్యక్తం చేసింది.
