బర్రెలక్క (కర్నె శిరీష) అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. హాయ్ ఫ్రెండ్స్.. అంటూ చేసిన ఒకే ఒక్క రీల్ ఆమెను సోషల్ మీడియా సెన్షేషన్‌ను చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనను రేకెత్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల గొంతుకగా ఆమె.. నాగర్‌కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ప్రచారంలో దూకుడుగా వ్యవహరించి.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అయితే ఫలితాల్లో మాత్రం వెనకబడింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే…
హాయ్ ఫ్రెండ్స్.. బర్రెలు కాయడానికి వచ్చానండి.. ఒక్కో బర్రె 2 నుంచి 3 లీటర్లు ఇస్తాయి ఫ్రెండ్స్.. పెద్ద చదవులు చదివినా ఉద్యోగం రాక బర్ల కాడికి వచ్చిన అంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. సరదాగా చేసిందో.. లేక తన అసహనాన్ని తెలిపేందుకు చేసిందో కానీ.. ఓ రీల్ తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.