NTV Telugu Site icon

Bank Locker rules: బ్యాంక్ లాకర్ ఛార్జీల పెంపు.. ఏ బ్యాంక్ లో ఎంతంటే..?

Rbi

Rbi

ఆర్బీఐ బ్యాంక్ లాకర్ నిబంధనలను మార్చింది. బ్యాంక్ లాకర్ సవరించిన ఒప్పందంపై ఖాతాదారులతో సంతకం చేయడానికి దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తమ లాకర్ల ఛార్జీలలో మార్పులు చేశాయి. ప్రతి బ్యాంక్‌లో లాకర్ ఛార్జీలు దాని సైజ్ ప్లేస్‌మెంట్ ఆధారంగా మారుతుంటాయి.ఏఏ బ్యాంకులు తమ లాకర్లకు ఎంత వసూలు చేస్తున్నాయి అనేది మీకు తెలుసా..?

Read Also: Harsha Missing Case: మల్కాజ్గిరి హర్షవర్ధన్ కిడ్నాప్ కేసు.. కడప వాసి స్కెచ్

వాల్యుయేషన్ పరంగా భారత్ లో అతిపెద్ద బ్యాంక్ అయిన హెడీఎఫ్సీ బ్యాంక్ లాకర్ ఛార్జీలు రూ. 1,350 నుంచి రూ. 20,000 వరకు ఉండవచ్చు, ఇది వార్షికంగా ఉంది. మెట్రోపాలిటన్ నగరాలు, పట్టణ ప్రాంతాలను బట్టి బ్యాంక్ వేర్వేరు ఛార్జీలను తీసుకుంటోంది. మిడ్ సైజ్ బ్యాంక్ లాకర్‌కు రూ. 3000, పెద్ద లాకర్‌కు రూ. 7000 ఛార్జీ వసూలు చేస్తుంది. మరోవైపు, ఖాతాదారులకు అదనపు పెద్ద లాకర్లు అవసరమైతే, వారు దగ్గర నుంచి ఏటా రూ.15,000 తీసుకుంటుంది.

Read Also: Sandeepa Dhar Pics: సందీప ధార్ హాట్ స్టిల్స్.. కుర్రాళ్ల కళ్లన్నీ బ్యూటీపైనే

దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ కూడా చిన్న సైజు నుంచి మిడ్ సైజ్ వరకు లాకర్లకు వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తుంది. చిన్న సైజు లాకర్లకు రూ.1200-5000 వరకు వసూలు చేస్తుండగా.. అదే సమయంలో మీడియం సైజ్ లాకర్లకు రూ.2500-9000 వసూలు.. అలాగే పెద్ద లాకర్ల కోసం బ్యాంకులు ఏడాదికి రూ.4000 నుంచి రూ.9000 వరకు వసూలు చేస్తున్నాయి.

Read Also: Hebah Patel : హాట్ అందాలతో రెచ్చగొడుతున్న హెబ్బా పటేల్..

ఇక 40 కోట్లకు పైగా ఖాతాదారులతో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కస్టమర్లకు 3 సైజుల లాకర్ల సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ మూడు రకాల లాకర్ల ఛార్జీలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఎస్బీఐ వారి నగరంలో నివసిస్తున్న కస్టమర్ల నుంచి రూ. 2000+ GST కూడా వసూలు చేస్తోంది. అదే సమయంలో, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో నివసించే వినియోగదార్ల నుంచి బ్యాంక్ రూ. 1500+ జీఎస్టీని వసూలు చేస్తోంది.

Read Also: PM Modi: రష్యాపై భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..

దేశంలోని మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్.. తన లాకర్ ఛార్జీలను మార్చింది. లాకర్ కోసం బ్యాంక్ కేవలం రూ. 400 మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీ వసూలు చేస్తోంది. GST మాత్రం వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. లాకర్‌ను ఆపరేట్ చేయడానికి సర్వీస్ ఛార్జ్ 12 ఉపయోగాలకు ఉచితం. ఆ తర్వాత లాకర్‌ని ఉపయోగిస్తే ఒక్కో ఆపరేషన్‌కు రూ.100+ జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.