NTV Telugu Site icon

Ind Vs Ban: బంగ్లాదేశ్‌ సూపర్‌ ఫ్యాన్‌పై దాడి.. స్పందించిన పోలీసులు(వీడియో)

Bangladesh

Bangladesh

భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరగడంతో క్రికెట్ జట్టు ఆటగాళ్లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీ బ్లాక్‌లో ఉన్న రాబి బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఊపుతూ.. మద్దతుగా నినాదాలు చేశాడని, దాంతో స్థానిక భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురై అతనితో వాగ్వాదానికి దిగారని, లంచ్ బ్రేక్ సమయంలో టైగర్ రాబీపై బౌతిక దాడికి పాల్పడ్డారని కూడా ప్రచారం జరిగింది. టైగర్ రాబీని పోలీసులు మైదానం బయటకు తీసుకెళ్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

READ MORE: Delhi: ఆప్‌కు షాక్.. ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సీటు బీజేపీ కైవసం

తాజాగా దీనిపై స్పందించ పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని కాన్పూర్ పోలీసులు స్పష్టం చేశారు. చికిత్స అనంతరం రాబిన్ వీడియోలో మాట్లాడుతూ.. “నేను అనారోగ్యానికి గురయ్యాను. పోలీసులు నన్ను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. నా పేరు రాబీ. నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చాను.” అని చెప్పడం కనిపించింది.

READ MORE: Crime: రూ.300 కోట్లకు పైగా మోసం చేసి.. సాధువుగా మారిన నిందితుడు.. చివరికీ..

రాబీకి తక్షణమే వైద్యసేవలు అందించామని ఏసీపీ (కల్యాణ్‌పూర్) అభిషేక్ పాండే తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం తనపై దాడి జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. ఆ అధికారి మాట్లాడుతూ.. “భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య టెస్టు మ్యాచ్‌ సందర్భంగా టైగర్‌ అనే ప్రేక్షకుల్లో ఒకరు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వెంటనే పోలీసులు అతడిని వైద్య బృందానికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. దాడి జరిగినట్లు కొన్ని రిపోర్టులు వచ్చాయి. అయితే ఇవి నిరాధారమైనవి. అక్కడ అలాంటి ఘటనే జరగలేదు.” అని తెలిపారు.