Bangalore Teacher : ఒక్క ముద్దు పెడితే రూ.50వేలు. ఇది కర్ణాటకలోని ఓ ఖిలాడీ టీచర్ వ్యవహారం. ముద్దులు పెట్టి లక్షలు కాజేసింది. బెంగుళూరు లోని మహాలక్ష్మీ లే అవుట్ లో శ్రీదేవి అనే టీచర్ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. అదే స్కూల్ కు రాకేష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. పిల్లల కోసం తరచూ స్కూల్ కు వెళ్తున్న క్రమంలో శ్రీదేవితో పరిచయం బాగా పెరిగింది. శ్రీదేవి కూడా అతన్ని తన బుట్టలో వేసుకుంది. తనకు రూ.4లక్షలు కావాలని రాకేష్ నుంచి తీసుకుంది. 2024 మార్చి నెలలోనే ఇచ్చేస్తానని నమ్మించింది. కానీ గడువు దాటిపోయినా ఇవ్వలేదు.
దీంతో రాకేష్ కు అనుమానం వచ్చి నిలదీశాడు. ఈ క్రమంలోనే శ్రీదేవి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఇద్దరూ కలిసి బయట తిరగడాలు, ఫోన్లో మాట్లాడుకోవడాలు జరిగాయి. డోస్ మరింత పెంచేసి ముద్దులు, హగ్గుల దాకా వెళ్లిపోయారు. ఆ టైమ్ లో రాకేష్ మరోసారి తన డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఇదే సరైన టైమ్ నుకుని శ్రీదేవి ప్లేటు తిప్పేసింది. తనను చాలా సార్లు ముద్దు పెట్టుకున్నావని.. ముద్దుకు రూ.50వేల చొప్పున నువ్వే రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే అందరికీ విషయం చెప్తానంటూ బెదిరించింది.
Read Also : TTD : ఏప్రిల్ 5 నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు
చేసేది లేక రాకేష్ ఆమెతో డీల్ పెట్టుకోవాలనుకున్నాడు. శ్రీదేవితో పాటు మరో ఇద్దరు రాకేష్ ను స్కూల్ కు పిలిపించుకున్నారు. కోటి రూపాయలు ఇవ్వాలని లేదంటే నువ్వే బలవంతం చేశావని కేసులు పెట్టి అందరికీ చెప్పేస్తామంటూ బెదిరించారు. రాకేష్ భయపడి పోయి రూ.20లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అదే టైమ్ లో రూ.1.50లక్షలు ఇచ్చేసి వచ్చాడు. మిగతా డబ్బుల కోసం శ్రీదేవి గ్యాంగ్ బెదిరింపులకు దిగింది. చేసేది లేక రాకేష్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.