ప్రస్తుత రోజుల్లో ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే కొందరు ఈ ఖర్చులను అధిగమించేందుకు పార్ట్ టైమ్ జాబ్ చూస్తూ అదనపు ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు. డెలివరీ పార్ట్ నర్స్ గా, క్యాబ్ డ్రైవర్స్ గా పనిచేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా బెంగళూరులో చాలా మంది లక్షల ప్యాకేజీలతో ఐటీ జాబ్స్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం క్యాబ్ డ్రైవర్స్ గా చేస్తున్నారు. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే? ఒంటరితనం నుంచి బయటపడడానికి, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి అంటున్నారు.
Also Read:Minister Narayana: ప్రాణ నష్ఠం జరగకుండా ఉండాలనేది మా టార్గెట్ !
27 ఏళ్ల అభినవ్ రవీంద్రన్ రెండేళ్ల క్రితం విజయవాడ నుండి బెంగళూరుకు మకాం మార్చాడు. అతను సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఎక్స్ పర్ట్. మొదట్లో బాగానే సాగింది. కానీ సుద్దగుంటెపాల్య ప్రాంతంలో ఒంటరిగా నివసించడం వల్ల అతనికి ఇంటి మీద బెంగ, ఒంటరితనం కలిగింది. పని ఒత్తిడి క్రమంగా పెరిగింది. 18 నెలల తర్వాత, అతను కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని నిర్ణయించుకుని క్యాబ్ నడపడం ప్రారంభించాడు.
అభినవ్ ఇప్పుడు పగటిపూట టెక్ జాబ్ చేస్తూ వారానికి రెండు రాత్రులు క్యాబ్ నడుపుతున్నాడు. అతను “నమ్మ యాత్రి” యాప్ లో సైన్ అప్ చేసుకున్నాడు. ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఎయిర్ పోర్ట్ రూట్ ఎంచుకున్నట్లు తెలిపాడు. ఈ పని తనకు మానసిక ఉపశమనం కలిగిస్తుందని, 6,000-7,000 రూపాయల అదనపు ఆదాయాన్ని అందిస్తుందని అతను చెప్పాడు.
Also Read:Fake Babas Gang: దుండిగల్‌లో దొంగ బాబాల ముఠా.. మత్తుమందు చల్లి రూ. 8.5 లక్షలు స్వాహా..!
బెంగళూరులోని చాలా మంది ఐటీ నిపుణులు ఇప్పుడు ఓలా, ఉబర్, రాపిడో, నమ్మ యాత్రి వంటి ప్లాట్‌ఫామ్‌లపై డ్రైవింగ్ చేస్తున్నారని సోషల్ మీడియా పోస్ట్‌లు వెల్లడించాయి. వారు ఒత్తిడిని తగ్గించడానికి, అపరిచితులతో చాట్ చేయడానికి లేదా కొంచెం అదనపు డబ్బు సంపాదించడానికి ఇలా చేస్తు్న్నట్లు వెల్లడైంది. ఈ ట్రెండ్ కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, కార్పొరేట్ ఒత్తిడి, మానసిక అలసటతో ముడిపడి ఉందని చాలామంది విశ్వసిస్తున్నారు.