Bandla Ganesh : యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రామ్ పోతినేని. ఎక్కడికి వెళ్లినా తన స్టైలిష్ లుక్ తో అమ్మాయిల ఫేవరేట్ అయిపోతారు. ఇటీవల ఓ క్లాత్ షోరూమ్ ఓపెన్ చేయడానికి హోమ్ టౌన్ విజయవాడ వచ్చాడు రామ్. కిరాక్ లుక్‌లో కనిపించి.. ఫ్యాన్స్, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు. తనను చూడ్డానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారు. రామ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాలుగు ఫోటోలు ఫ్యాన్స్, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే రామ్.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు..రామ్ డిఫరెంట్ లుక్‌లో ఉన్న యానిమేటెడ్ ఇమేజెస్ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా షేర్ చేశాడు.. ‘వీటిలో ఏది మీ ఫేవరెట్?’.. అని అభిమానులను అడిగారు.. దీనికి నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది. అన్ని పిక్స్ బాగున్నాయంటూ రిప్లై ఇస్తున్నారు. లేడీ ఫ్యాన్స్ అయితే.. ‘రామ్, నన్ను పెళ్లి చేసుకో.. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ‘హాలీవుడ్ హీరోలా ఉన్నావ్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. హీరో రామ్ కు ట్విట్టర్‌లో 2.8 మిలియన్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం రామ్ తన 20వ చిత్రాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చెయ్యబోతున్నాడు.. దాని కోసమే ఇలా సరికొత్త అవతారంలోకి మారిపోయాడు రామ్.. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం
Looking like a Hollywood star ⭐️👌@ramsayz https://t.co/8FVAK3aVPo
— BANDLA GANESH. (@ganeshbandla) December 10, 2022