Site icon NTV Telugu

Bandi Sanjay: రేపు ప్రధాని మోడీని కుటుంబ సమేతంగా కలవనున్న బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆయన మోడీని కలవనున్నారు. అనంతరం ఎల్లుండి( శుక్రవారం) బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఎంపీ బండి సంజయ్‌కి బీజేపీ అధిష్టానం ఎలాంటి పదవి కేటాయించలేదు. దీనిపై కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్ధితుల్లో రెండ్రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

Read Also: Rome: చీర‌క‌ట్టుతో రోమ్ వీధుల్లో.. మ్యారేజ్ యానివ‌ర్సరీ కావడంతో మెరిసిన‌ మ‌హిళ‌

ఇక, ఇదే సమయంలో బండి సంజయ్ గురించి సోషల్ మీడియాలో కీలక ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బండి సంజయ్ ని నియమించనున్నారన్నది అనే వార్త చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సునీల్ దేవధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ దేవధర్ స్థానంలో మరో నాయకుడిని నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తుంది.

Read Also: Danger Pilla: ఆమ్మో ‘డేంజర్ పిల్ల’ అంటున్న నితిన్

అయితే, ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అనదగ్గ నేతలు ఎవరు లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో సంజయ్‌కి కనుక అక్కడి పగ్గాలు అప్పగిస్తే మంచిదేననే చర్చ బీజేపీ పార్టీలో జరుగుతోంది. మరి ఇది కేవలం ప్రచారం మాత్రమేనా.. లేక దీనిపై ఢిల్లీ పెద్దల నుంచి లీకులు వచ్చాయా అనే ప్రచారం కొనసాగుతుంది. చూడాలి.. ఏదీ ఏమైనా బండి సంజయ్ ను ఏ రాష్ట్రానికి ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగిస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version