కార్వాన్ ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాగ్యనగర్ యువకులారా …. మజ్లిస్ సవాల్ ను స్వీకరించండని, 8 నెలలు సమయమివ్వండి…. రామరాజ్యం స్థాపించే బాధ్యత మాది అని ఆయన వ్యాఖ్యానించారు. శివాజీ స్పూర్తితో పోరాడదాం… ఓటు అనే ఆయుధంతో మజ్లిస్ ను పాతిపెడదామని బండి సంజయ్ అన్నారు. మజ్లిస్ కు దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. బీజేపీ దమ్ము చూపిస్తాం… డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు. తెలంగాణలో హిందుత్వ వాతావారణం కన్పిస్తోందని, భగ్నం చేసేందుకు టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ గుంట నక్కలన్నీ ఒక్కటై కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీ సింహం… ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Satyavati Rathod : వైఎస్ షర్మిలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్
రామరాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని ఆయన వెల్లడించారు. 12 శాతం ఓట్లున్న పార్టీకి 7 సీట్లు వస్తే…. 80 శాతం ఓట్లున్న మనకు ఎన్ని సీట్లు రావాలె? అని ఆయన అన్నారు. పాతబస్తీ మనదే… తెలంగాణ మనదే అని ఆయన అన్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కలశం, మామిడితోరణాలున్న పాత సచివాలయాన్ని కూల్చేసి డోమ్ లను నిర్మిస్తారా? అని ఆయని ప్రశ్నించారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసం హిందుత్వాన్ని తాకట్టు పెడతారా? అని ఆయన మండిపడ్డారు. బరాబర్ సెక్రటేరియట్ డోమ్ లను కూల్చి వేస్తామని, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మారుస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్… మరో రాజా మాన్ సింగ్ అని, నిఖార్సైన హిందువునంటూ… ఒవైసీకి సాగిలపడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Mahanandi Temple: శంభో శివశంభో.. భక్తులతో పోటెత్తిన మహానంది