Bandi Sanjay : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మెదక్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన సభలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్” అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం స్వయంగా చేసిన వ్యాఖ్యలే వారి వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్, మహిళలకు నెలనెలా రూ.2,500, తులం బంగారం వంటి హామీలు నేరవేర్చని ప్రభుత్వం, నిరుద్యోగులకు వాగ్దానం చేసిన రూ.4,000 భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. అంతేకాదు, విద్యార్థులకు హామీగా చెప్పిన రూ.5 లక్షల భరోసా కార్డు ఇప్పుడు లేదన్నట్టే తేలిందని విమర్శించారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..!
“సంవిధాన్” చూపిస్తూ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ బండి సంజయ్, ఆయన వాటికి సమాధానం చెప్పక తప్పదన్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజల మధ్య నిలదీస్తామని హెచ్చరించారు. రాజీవ్ రహదారి నిర్మాణం, నాణ్యతపై వస్తున్న విమర్శలపై కూడా బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఈ రహదారిని కాంగ్రెస్ ప్రభుత్వం నాగుపాముల్లా వంకరటింకరగా నిర్మించిందని, కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేయించిందని ఆరోపించారు. ఇకపై 2035 వరకు కాంట్రాక్టర్‌తో ఒప్పందం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించి, 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2022లోనే ప్రతిపాదనలు చేసిన విషయాన్ని సంజయ్ స్పష్టం చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని బండి సంజయ్ విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డకు కూడా కేంద్ర మంత్రి గడ్కరీ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు గుర్తుచేశారు. లేఖల పేరుతో కేంద్రంపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, మంత్రులు కూడా స్పష్టత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
Civil Mock Drill : రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే..
