ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బండి సంజయ్ కు బీజేపీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ కు రావడంతో వేలాది మంది వచ్చి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఆఫీస్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు మోడీ, అమిత్ షా, నడ్డలకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పదవితో సంబంధం లేకుండా కార్యకర్తలు చూపిస్తున్న అభిమానం, నా మీద నమ్మకం ఉంచినందుకు తెలంగాణ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను అని బండి సంజయ్ చెప్పారు.
Read Also: Haryana: నుహ్లో వైఫల్యం తర్వాత అధికారుల బదిలీలు
ఇంత అదృష్టం ఎవరికి ఉండదు.. నాకు ఈ అవకాశం పార్టీ పెద్దలు కల్పించారు అని బండి సంజయ్ అన్నారు. కార్యకర్తలు పడ్డ కష్టాన్ని ఎప్పుడు మర్చిపోను.. గొల్లకొండ ఖిల్లా మీద కాషాయ జండా ఎగురవేద్దాం.. బీజేపీ గ్రాఫ్ తగిందని, ఆ పార్టీ లో గ్రూపులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కిషన్ రెడ్డి నాయకత్వ లో బీజేపీ రాజ్యం, రామ రాజ్యం స్థాపిస్తామని ఆయన వెల్లడించారు. చిన్న చిన్న వాటిని బూతద్దంలో చూపి ఏదో ప్రచారం చేస్తున్నారు.. బీజేపీ కార్యకర్తలు పార్టీ సిద్దాంతం కోసం పని చేస్తారు.. వ్యక్తి కోసమో, ఇమేజ్ పెంచుకోవడం కోసమో పని చేసే వారు కాదు అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also: NC 23: వైజాగులో బోటెక్కి సముద్రంలో డ్రైవింగ్ నేర్చుకున్న నాగ చైతన్య
నా పైన తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ తెలంగాణ సమాజం, యువత మర్చి పోదు అని బండి సంజయ్ పేర్కొన్నారు. పచ్చటి ఇంట్లో పాము జోర్రి కాటు వేసినట్టు.. ఈ రోజు ఒక కుటుంబము జోర్రి తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. కేసీఆర్ రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదు.. రైతులు నిలదీస్తారనీ కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళలేదు.. కేసీఆర్ కొత్త డ్రామాలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు మొదటి ముద్దాయి..! కేసు నమోదు చేయాలి
కేసీఆర్ ఎన్నికల తరవాత పత్తా లేకుండా పోతాడు.. ఆర్టీసీ కార్మికులను మోసం చేసేందుకు, ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు.. ఆర్టీసీ కార్మికుల మరణానికి కారణం అయిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల కోసం మేము జైలుకు పోయాము.. ఫస్ట్ నాడు జీతాలు ఇస్తా అని మాత్రం కేసీఆర్ చెప్పడం లేదు.. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు.. మద్యం ద్వారా 75 వేల కోట్లు సంపాదించుకావాలని కేసీఆర్ చూస్తున్నాడు.. నువ్వు ఉండేది మూడు నెలలు రెండు ఏళ్లకు టెండర్లు ఎలా పిలుస్తావు.. మేము అంత కలిసిమెలిసి పని చేసి తెలంగాణలో అధికారంలోకి రావడానికి కృషి చేస్తాం.. ఎంఐఎంతో కలిసి ఎందుకు అవిశ్వాసం ప్రవేశ పెట్టారో పార్లమెంట్లో ఎండ కడుతామని బండి సంజయ్ అన్నారు.
