Nagachaitanya learning boat driving for NC 23: యువ సామ్రాట్ నాగ చైతన్య తను చేయబోయే కొత్త సినిమా #NC23 కోసం సాగరతీరంలోని మత్స్యకారులని కలుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్న చైతూ ఈ రోజు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ తో కలిసి వైజాగ్ పోర్టును సందర్శించారు. అంతేకాదు ఈ సందర్భంగా మత్స్యకారులతో కలిసి బోటులో సముద్రంలోకి వెళ్లి సముద్రంలో వేట, ప్రయాణం, అక్కడ ఎదురయ్యే పరిస్థితి గురించి కూడా తెలుసుకున్నారు. నిజానికి నాగచైతన్య చేస్తున్న ఈ గ్రౌండ్ వర్క్ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఇలా స్థానికులని కలసి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని సహజత్వం ఉట్టిపడేలా నటించాలని ఆయన ప్రయత్నించడం చర్చనీయాంశం అవుతోంది.
Kusuma: వైష్ణవిని చూసి కుసుమ కూడా హాట్ షో మొదలెట్టేసింది.. లేటెస్ట్ పిక్స్ చూశారా?
ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. NC 23 అనే టైటిల్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించనున్నారు.NC 23 కథనం 2018లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆధారంగా కనిపిస్తుంది. కోస్తా ఆంధ్ర నుండి మత్స్యకారులు ప్రతి సంవత్సరం ఫిషింగ్ బోట్లలో పని చేయడానికి గుజరాత్‌కు వెళతారు. అలా గుజరాత్ బోటు ఓనర్ల దగ్గర జీతానికి పని చేసేటున్న ఆంధ్రాకు చెందిన 22 మంది మూడు పడవలపై గుజరాత్ సముద్రంలోకి వెళ్లారు. వారిని పాకిస్థాన్ అధికారులు పట్టుకుని కరాచీకి తీసుకెళ్ళారు. అక్రమమంగా తమ జలాల్లోకి ఎంటర్ అయ్యారనే వంకతో దాదాపు 13 నెలల పాటు వారిని బందీలుగా చేసుకున్నారు. చివరికి భారత ప్రభుత్వ చొరవతో వారు ఇండియా వచ్చారు. ఈ సంఘటన ఆధారంగా చేసుకుని కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కథ రాయగా గీతా ఆర్ట్స్ కి ఆ కథ నచ్చి చందూ మొండేటి చేతిలో పెట్టిందని అలా ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందని అంటున్నారు.