NTV Telugu Site icon

Bandi Sanjay: కాంగ్రెస్పై బండి సంజయ్ హాట్ కామెంట్స్..

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో హాట్ కామెంట్స్ చేశారు. వందసార్లు రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలారా.. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో కార్పొరేటర్లను కాంగ్రెస్ కొంటోందని బండి సంజయ్ ఆరోపించారు.

Ponguleti Srinivasa Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది

ఒక్కో కార్పొరేటర్ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షల జమ చేశారని.. తక్షణమే ఎన్నికల సంఘం బ్యాంకు లావాదేవీలపై విచారణ జరపాలని ఆయన కోరారు. డబ్బులు తీసుకున్న వారి అకౌంట్లని ఈసీ పరిశీలించాలన్నారు. కేసీఆర్ బలుపెక్కి దేవుడి తీర్థ ప్రసాదాలు, అక్షింతలను హేళన చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేం బరాబర్ రాముడి భక్తులమే… నేను పక్కా లోకల్… గరీబోళ్ల బిడ్డను అని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడు అని ఆరోపించారు.

Nirmala Sitharaman: ప్రజ్వల్ రేవణ్ణపై సాక్ష్యాలు ఉన్నా ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు..