నిర్మల్ జిల్లాలో చాతా గ్రామంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ కామెంట్స్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత పాదయాత్ర నేడు కొనసాగింది. అయితే.. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ల ఉసురు పోసుకుంటున్నాడన్నారు. ప్రజల కోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నామని, ధరణి పేరుతో… టీఆర్‌ఎస్ వాళ్ళు పేదల జాగాలు లాక్కుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. పేదల బతుకుకు భరోసా లేదని, తెలంగాణలో పేదల ప్రభుత్వం రావాలన్నారు బండి సంజయ్. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండని, బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు బండి సంజయ్.
Also Read : ISIS: ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ హసన్ అల్ ఖురాషీ హతం..
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా… కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. వందరోజుల ఉపాధి హామీ పథకం నిధులను మోడీ ఇస్తే…. కేసీఆర్ జేబులో వేసుకున్నాడని ఆయన ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ధరణి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే టీఆర్ఎస్ వాళ్లు దొబ్బుకు పోతారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండని, ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండన్నారు. ప్రతి బిడ్డ నెత్తిపై లక్ష ఇరవై వేల రూపాయల అప్పు పెట్టిండు అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు.
Also Read : Vaikunta Dwara Darshanam: శ్రీవారి భక్తులకు అలర్ట్.. టికెట్లు ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం..
