Bandi Sanjay : కేసీఆర్‌పై హత్య కేసు నమోదు చేయాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈరోజు వేములవాడలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారి హత్య, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులపై స్పందించారు.
Also Read : IT Companies Lay offs: మొన్న.. ట్విట్టర్. నిన్న.. మెటా. నేడు.. ‘‘సిస్కో’’?
ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని కుర్చీ వేసుకుని కుర్చొని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది?. మళ్లీ అధికారులను పంపి దాడులు చేయించేది కేసీఆరే. పంట చేతికొచ్చే సమయానికి దాడులు చేసి పంటను నాశనం చేయించేది కేసీఆర్.
Also Read : MLA Jagga Reddy : కేంద్రం ఈడీ, కేసీఆర్ ఏసీబీ వాడుతున్నారు.. మా దగ్గర ఏ శాఖ లేదు.. మేమేం చేస్తాం
Also Read
సమస్యను పరిష్కరించకుండా కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నడు. సీఎం కుట్రలకు అధికారులను బలి చేస్తున్నారు. బీజేపీ నేతలకు నోటీసులతో బెదిరింపులకు దిగుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నడు. తన పదవిని కాపాడుకునే యత్నం చేస్తున్నడు.
Also Read : Supreme Court: ఈసీ నియామకంపై సుప్రీం అసహనం.. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు?
కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఆడుతున్న డ్రామా. లిక్కర్ స్కాంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు. సీఎం, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును దోచుకుని అడ్డంగా దోచుకుంటున్నరు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.
ఐటీ, సీబీఐ, ఈడీ దాడులపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు. ప్రజలను రాచిరంపాన పెట్టి అడ్డగోలుగా, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్లను కంట్రోల్ చేయాలా? వద్దా?… రాజకీయ విమర్శలు చేసే వాళ్లు సమాధానం చెప్పాలి. అక్రమార్కులను పార్టీలకు అపాదించడం కరెక్ట్ కాదు. అక్రమార్కుల మీద దాడులు చేస్తే అడ్డుకోవడమేంది?
అధికారులు తనిఖీలు చేస్తే నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఉంది. అది చేతగానివాళ్లే బూతులు తిడుతూ దాడులు చేస్తూ రాజకీయ రంగు పులుమతారు. అవినీతి తిమంగలాలను వదిలిపెట్టాలా? అవినీతి పరులు తప్పించుకోవడానికి ఏదో ఒక విమర్శలు చేయడం సిగ్గు చేటు. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. బీజేపీ ఎంపీపైనా కూడా దాడులు చేశారు కదా… వాటికి పార్టీలతో పనిలేదు.’ అని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!