Bandai Sanjay : పంచాయితీ రాజ్ నిధుల దుర్వినియోగంపై కేంద్రమంత్రికి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వంచే పంచాయితీ రాజ్ నిధుల దుర్వినియోగం అవుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలను నిధులు విడుదల చేసింది. పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ఈ డబ్బును డ్రా చేసి, ఆయా గ్రామ పంచాయితీలోని సంక్షేమ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అధికారం సర్పంచులకు మాత్రమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పేరుపై బ్యాంకు ఖాతా తెరిచింది. గ్రామ పంచాయితీ కమిటీ తీర్మానం ఆధారంగా వీరికి ఆ డబ్బు డ్రా చేసే అధికారం ఉంటుంది.
Also Read : Off The Record about BJP Focus on bhadrachalam: రాముడి సెంటిమెంట్‌పై ఆశలు..! భద్రాచలంపై బీజేపీ ఫోకస్..!
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు నేరుగా నిధులు కేటాయిస్తూ, విడుదల చేస్తున్నది. ఇందులో 50 శాతం నిధులు రహదారుల నిర్మాణానికి, మిగిలిన 50 శాతం నిధులు సంక్షేమం, నిర్వహణకు వెచ్చించాలి. కేంద్ర ప్రభుత్వం తాజా విడత నిధులను తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయితీలకు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఆయా గ్రామ సర్పంచులకు తెలియచేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయితీ రాజ్ శాఖ అధికారులు సర్పంచులు, ఉప సర్పంచులకు తెలియకుండా, వారి బ్యాంకు ఖాతాల డిజిటల్ కీ ఆధారంగా ఈ నిధులను విత్ డ్రా చేసి కరెంటు బిల్లుల బకాయిలు, ఇతర బిల్లులకు అడ్వాన్సులు చెల్లించారు. పైపెచ్చు నిబంధనలకు విరుద్ధమైన పాత బకాయిలు చెల్లించేందుకు ఈ నిధులు వినియోగించినట్టు తెలుస్తున్నది.
Also Read
- Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
తెలంగాణలో అన్ని ప్రాంతాలకు చెందిన సర్పంచులు నన్ను కలిసి, ఈ నిధులు తిరిగి తమ ఖాతాలో జమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వినతిపత్రం సమర్పించారు. గ్రామ పంచాయితీలకు, స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను దారి మళ్లించడం తెలంగాణ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇటీవలె MGNREGA నిధులు కూడా దారి మళ్లించి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వినియోగించినట్టు నా దృష్టికి వచ్చింది. పై విషయాలను గమనంలోకి తీసుకొని, భారత రాజ్యాంగంలోని 73, 74 సవరణల ప్రకారం స్థానిక సంస్థల హక్కులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని బండి సంజయ్ లేఖ రాశారు.
తాజావార్తలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!