కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆపరేషన్ కగార్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ కగార్ ఆగదు… మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందే… లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. మావోలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు.. నక్సల్స్ హింసలో ఎందరో లీడర్లు చనిపోయారు… పోలీసులు చనిపోయారు… అప్పుడు చర్చల గురించి.. మావోయిస్టులకు మద్దతుగా కేసీఆర్, రేవంత్ ఎందుకు మాట్లాడలేదు.. మావోయిస్టు పార్టీ నిషేధ సంస్థ వారితో చర్చలు ఉండవు.
Also Read:Medak: పెళ్లయిన మూడు నెలలకే ఘోరం.. అసలు ఏం జరిగిందంటే?
పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వలదే… వారు కేంద్రంతో సహకరించాలి.. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన కులగణనకి కేంద్ర చేసే గణన కి చాలా తేడా ఉంటది.. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక పోయింది రేవంత్ సర్కార్.. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్.. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీసహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు నక్సల్స్.. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినవాళ్లు మావోయిస్టులు.
Also Read:Producers : ఆ విలక్షణ నటుడి కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు.. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం.. కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం.. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణనకు పొంతనే ఉండదు.. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది.. బీసీల జనాభాను తగ్గించి చూపారు.. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు.. 6 గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది..
Also Read:Macherla: మాచర్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. భారీగా మారణాయుధాలు లభ్యం!
పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం.. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు.. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే.. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు.. నక్సల్స్ తో మాటల్లేవు… మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
