NTV Telugu Site icon

Bandi Sanjay : ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారు..

Bandi Sanjay

Bandi Sanjay

గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీ ఛార్జీ చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై లాఠీచార్జి ని ఖండిస్తున్నామని, ప్రభుత్వం గ్రూప్ 1 విషయంలో తప్పు చేసిందన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారని, ఇది చిల్లర చర్య…. ఈ జీవో ఎవరి ఆలోచన అని, గ్రూప్స్ పరీక్షను వాయిదా వేయాలి… జీవో-29 పై చర్చ చేయండన్నారు. షాపుల్లో ఉన్నవారిని కూడా లాక్కొచ్చి మరీ కొడుతున్నారు… ఇదేం పద్ధతి, ప్రభుత్వం అబద్దాలు ఆడుతోంది… 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 30 వేల జాబ్స్ ఇచ్చామంటున్నారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు… అమలు చేయడం లేదని, గత ప్రభుత్వనికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏమాత్రం తేడాలేదన్నారు. నోటిఫికేషన్ల విషయంలో కేసీఆర్ ఆలోచనా విధానం కాంగ్రెస్ అమలు చేస్తూ… కోర్ట్ కేసులు, నోటిఫికేషన్ లోపాలు చేస్తున్నారని, నిరుద్యోగులకు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని అంటున్నాడన్నారు. సిగ్గుందాలి.. కేటీఆర్ పదేళ్ళలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని ఇప్పుడు పోరాటం అంటున్నారని, పేపర్ లీకేజీలకు, కోర్ట్ కేసులకు విద్యార్థుల, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు.

Viral: బాయ్‌ఫ్రెండ్‌ని పెట్టెలో దాచి పెట్టిన యువతి.. చివరికి ఏమైందంటే..?

అంతేకాకుండా..’నేను అశోక్ నగర్ కి వెళ్తాను… నిరుద్యోగుల తరపున పోరాడుతా… సమస్యను జటిలం చేయకుండా ప్రభుత్వం స్పందించాలి.. విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ప్రభుత్వాలు తారుమారు అయ్యాయి… అశోక్ నగర్ లో మొదలైన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించక ముందే ప్రభుత్వం దిగిరావాలి కేంద్ర మంత్రిగా కాకుండా.సామాన్య కార్యకర్తగా వెళ్తాను. గతంలో కేసీఆర్ కాళేశ్వరం అని పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టి లక్షకోట్లు ముంచాడు. ఇప్పుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ మాతో మోసానికి తెరలేపారు. ప్రభుత్వం హైడ్రా పై పునరాలోచన చేయాలి… 12 వేల కుటుంబాలను ముంచి పొట్టగొట్టి మూసి సుందరికరణ దేనికి…? మూసి సుందరికరణ కోసం ప్రపంచ బ్యాంకు ముందు కాంగ్రెస్ సర్కారు సాగిలపడింది.. పేదలు అన్ని పర్మిషన్లు తీసుకుని కట్టిన ఇళ్లను ఎలా కూలగొడతారు… అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోండి.. హైడ్రా అంటే ప్రజలకు భూతంలా కనిపిస్తుంది… హైడ్రా అంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. హైడ్రా, గ్రూప్ వన్ అంశాలను ఆసరా చేసుకుని రేవంత్ ని దించేందుకు కొందరు మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలును పక్కదారి పట్టించేందుకు ఈ వివాదాలు రేపుతున్నారు…’ అని బండి సంజయ్‌ అన్నారు.

Jio Smart Shopping Cart: ‘స్మార్ట్ షాపింగ్ కార్ట్’ వచ్చేసింది.. బిల్లింగ్ కోసం క్యూలో నిలబడాల్సిన పనిలేదు!

Show comments