సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం సండే మార్కెట్ లో బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా పటాన్ చెరు మైత్రి గ్రౌండ్ నుంచి బండి సంజయ్ కు స్వాగతం పలికారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్, పార్టీ శ్రేణులు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పైసలిచ్చి మహిపాల్ రెడ్డి టికెట్ తెచ్చుకున్నారని, మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు విస్తరణకు కృషి చేస్తామన్నారు బండి సంజయ్. ప్రధాని మోడీ ఇచ్చే పైసలతో డబుల్ బెడ్ రూం కట్టారు. ఆసుపత్రులు కట్టారని, నీళ్లు, నిధులు,నియమకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆయనకు మాత్రమే తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు బండి సంజయ్.
Also Read : Bhatti Vikramarka: కాంగ్రెస్‌దే అధికారం.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం..
అంతేకాకుండా.. ‘బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే. రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు కూర్చుని ఆరు గ్యారంటీ పధకాలు సృష్టించారు. సమర్ధ పాలన కేవలం బిజేపి తోనే సాధ్యం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది. పోడు భూముల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లడితే మాపై కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికోసమైనా కొట్లాడి జైలుకు పోయారా? బీసీ ముఖ్యమంత్రి డిక్లరేషన్ చేసి బిజేపి సంచనం సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బిజేపి గెలవాలి. కేసీఆర్ దారుసలాంకు సలాం చేయడు దారుకే సలాం చేస్తాడు. మైనారిటీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయి. ఓటు బ్యాంకుగానే వారిని చూస్తున్నారు. హిందుత్వాన్ని కాపాడుకోవాలి, హిందు ధర్మం కాపాడుకోకపోతే పెను ప్రమాదం తప్పదు. రాష్ట్రంలో బిఆర్ఎస్ రజాకార్ల పాలన కొనసాగుతోంది.. కేసీఆర్ నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read : Sehar Shinwari: పాక్ నటిని ఏకిపారేస్తున్న ఇండియన్స్.. బాగా ఏడువు అంటూ కామెంట్స్