NTV Telugu Site icon

Bandi Sanjay : తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మరిచారు

Bandi Sanjay Karimnagar

Bandi Sanjay Karimnagar

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మరిచారని, ఉద్యమ ద్రోహులకు తన కేబినెట్‌లో చోటిచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికలు రాగానే డబ్బు సంచులతో మళ్ళీ అధికారంలోకి రావడం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తారని, బీజేపీలో సీట్లు ప్రకటన చేసేది మా ఢిల్లీ పెద్దలు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుండి చేస్తానన్నారు. ఇతర పార్టీల లాగా బీజేపీలో ఉండదు నా సీటు మీద కూడా నాకు నమ్మకం లేదు సీటు కేటాయించేది ఢిల్లీ పెద్దలే అని ఆయన వెల్లడించారు. మేము ప్రకటన చేసే అభ్యర్థుల స్థానాలను రేపు కేసీఆర్ ప్రకటన చేస్తున్నారని, మరొక్కసారి కేసీఆర్ కు ఓటు వేసి ప్రజలు మోస పోవద్దన్నారు బండి సంజయ్‌. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అంశం సీబీఐ, ఈడీలు చూసుకుంటాయన్నారు.

Also Read : Gudivada Amarnath: గల్లీ క్రికెట్లో గెలిచి వరల్డ్ కప్ గెలిచినట్లు ఫీలవుతున్నారు.. టీడీపీపై విమర్శనాస్త్రాలు

ఇదిలా ఉంటే.. నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. అయితే.. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహేశ్వర్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళుతున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ.. డీకే అరుణ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న డీకే అరుణను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష్ కు తరలించడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ నియంత పోకడలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Also Read : IIT Roorkee : పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఐఐటీ రూర్కి..