Site icon NTV Telugu

Bandi Sanjay : కవిత చేసిన దొంగ సారా దందా.. కేసీఆర్‌కు నచ్చిన స్కీం

Bandi Sanjay

Bandi Sanjay

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత బతుకమ్మ పేరుతో తెలంగాణ సాంస్కృతిని దెబ్బ తీసిందన్నారు. చెప్పులు, హ్యాండ్ బ్యాగులు పెట్టించి కృతిమ పూలు, డీజే పాటలతో బతుకమ్మ అడించి విలువ తీసేసిందని ఆయన వ్యాఖ్యానించారు. BRS రాష్ట్ర కమిటీలో ఎంత మంది మహిళలు ఉన్నారని, కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అని ఆయన అన్నారు. కవిత చేసిన దొంగ సారా దందా.. కేసీఆర్ కు నచ్చిన స్కీం అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

Also Read : Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

తెలంగాణ మహిళలు తల దించుకునేలా చేసిందని, నరేంద్ర మోదీ ప్రధాని అయిన సంవత్సరమే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ ఏమీ చేశారో ఆలోచించాలన్నారు. BRSకి మహిళా కమిటీలే లేవు.. పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరూ? అని ఆయన అన్నారు. మహిళలకు ప్రభుత్వంలో పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ అని, వంట గదికే పరిమితమైన యాదమ్మ ప్రధానికి వంట చేసే స్థాయికి ఎదిగిందన్నారు. జల జీవన్ మిషన్ కింద ప్రధాని మహిళల కోసం ఆరు కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చారన్నారు.

Also Read : China: జనాభాను పెంచేందుకు చైనా అవస్థలు.. కొత్త జంటలకు డ్రాగన్‌ బంపర్ ఆఫర్

Exit mobile version