NTV Telugu Site icon

Bandi Sanjay: హిందూ దేవుళ్లంటే ఒవైసీకి చులకన

Bandi Sanjay

Bandi Sanjay

Ram Janmabhoomi: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టు కోల్పోతున్నామనే భయంతోనే ఒవైసీ పనికిమాలిన కామెంట్స్ చేస్తున్నాడని విమర్శించారు. హిందూ దేవుళ్లంటే ఒవైసీకి చులకన.. రామమందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని వివాదప్పదం చేసే కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవొద్దు.. ఈ నెల 22న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీ రాముడి అక్షింతలను ఈరోజు ఉదయం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షింతలను అందజేశారు.

Read Also: Adani-Hindenburg Case: అదానీ గ్రూప్‌కి సుప్రీంలో భారీ విజయం.. క్లీన్‌చిట్ ఇచ్చిన సెబీ..

రాజకీయాలకు అతీతంగా ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే దివ్యమైన, భవ్యమైన రామ మందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు ఆరోజు సాయంత్రం ప్రతి హిందువు తమ తమ ఇండ్లల్లో దీపాలు వెలిగించాలని ఆయన కోరారు. హిందూ మతం ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు.