Site icon NTV Telugu

Bandi Sanjay : రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుంది

Bandi Sanjay

Bandi Sanjay

రాజన్న సిరిసిల్ల పట్టణంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో శ్రీ చండీ యాగంలో కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు తీసుకున్న రుణమాఫీ 40 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 26 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి 16 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థం అవుతుందని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని రైతులని మోసం చేసి మిత్తికి మిత్తి కట్టి రైతులు అప్పుల పాలు అయ్యారని, దగాకోరు కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేసిందా లేదా కాదు  రైతులకు బ్యాంక్ లోను తీర్చి క్లియరెన్స్  సర్టిఫికెట్ ఇప్పించాలన్నారు బండి సంజయ్‌. లోన్ తీసుకున్న రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్ రాకుంటే భవిష్యత్ లో ఎలాంటి రుణం పొందలేరని, రైతులకు 70 శాతం రుణమాఫీ జరగలేదన్నారు బండి సంజయ్‌.

  Kolkata Doctor Case: “ఎందుకీ ద్వంద్వ వైఖరి”.. సీఎం మమతా బెనర్జీపై ట్రైనీ డాక్టర్ తండ్రి ఆగ్రహం..

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పథకం అమలు కాలేదని, కళ్యాణ లక్మి లక్ష రూపాయలు, తులం బంగారం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు బండి సంజయ్‌. 30 వేల ఉద్యోగాలని 12 వేల ఉద్యోగులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అద్దాల మేడలో కూర్చొని ప్రజలకు అన్ని చేశాం అని అనుకుంటుందన్నారు బండి సంజయ్‌. రైతు భరోసా, బోనస్, రుణమాఫీ చేస్తా అని చేయలేదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని, రైతులు అమాయకులు కాదు వారు దుఃఖం లో  ఉన్నారు  వారికి భరోసా కల్పించడం తో పాటు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు బండి సంజయ్‌. రెండు పార్టీల మోసపూరిత వాగ్దానాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరానికి 20 వేల రూపాయల సహకారం చేస్తుందన్నారు బండి సంజయ్‌. ఎంత మందికి రైతుల రుణమాఫీ చేసారు రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం  విడుదల చేయడం లేదన్నారు.

 Governor Jishnu Dev Varma: “మైల్స్‌ ఆఫ్‌ స్మైల్స్‌” మై లైఫ్‌ జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

Exit mobile version