Bandi Sanjay : బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే ప్రజలు బీజేపీకి ఓటు వేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమదేవికి మద్దతుగా పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే ప్రజలు బిజెపికి ఓటు వేయాలన్నారు. బీఆర్ఎస్ గెలిచినా.. కాంగ్రెస్ గెలిచిన ఉప ఎన్నికలు గ్యారంటీ అని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ సుస్థిర పాలన ఏర్పాటు చేసే వరకు ఆగదన్నారు. ప్రజల గుండెల్లో బిజెపి పువ్వు వికసించి ఉందన్నారు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ షాడో సీఎం.. ఆయనకింద ప్రతి మండలానికి ముగ్గురు సామంత రాజులు ఉన్నారన్నారు. పోలీసులకు మేము వ్యతిరేకం కాదు.. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండన్నారు బండి సంజయ్.
అంతేకాకుండా.. ‘బతుకమ్మ చీరలతో పదిమందిని బడా బాబులం చేశాడు. వర్కర్ టు ఓనర్ పథకం ద్వారా కార్మికులను చేస్తానని మరిచారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల నిరుద్యోగుల కోసం నేను కొట్లాడా.. టెన్త్ పేపర్ బికెజి పేరిట జైలుకు పంపారు. ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు వచ్చిన.. పెన్షన్ దారులకు ఒకటో తేదీన పెన్షన్ వచ్చిన బిఆర్ఎస్ కు ఓటెయ్యండి. ఉద్యోగులకు జీతాలు రావాలంటే బండి సంజయ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. కేటీఆర్ ను సీఎం చేస్తానని ప్రకటిస్తే పార్టీలో పదిమంది ఎమ్మెల్యేలు కూడా ఉండరు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అయితే సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉంది. సిరిసిల్లలో ఎంతమంది చేనేత కార్మికులు, రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నావో శ్వేత పత్రం విడుదల చేయాలి. బీసీలకు గుణం లేదని ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటే ఓర్వలేక పోతున్నారు. సిరిసిల్లలో సైలెంట్ గా ఓటింగ్ జరుగుతుంది.. రాణి రుద్రమ ఎమ్మెల్యేగా కాబోతోంది.’ అని బండి సంజయ్ అన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..