NTV Telugu Site icon

Bandi Sanjay : కేంద్ర బడ్జెట్‌.. మోడీ విజనరీకి అద్దం పట్టేలా ఉంది

Sanjay Bandi

Sanjay Bandi

ఇది దేశ హిత బడ్జెట్ అని, మోడీ విజనరీకి అద్దం పట్టేలా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బండి సంజయ్‌ స్పందిస్తూ.. నాగలికి రెండు ఎడ్ల మాదిరిగా అభివ్రుద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకగా ఉంది. 2047 నాటికి ఆర్దిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ను రూపకల్పన జరిగింది. బడ్జెట్ లో ఏకంగా 11 లక్షల 50 కోట్ల రూపాయలను మౌలిక రంగాల అభివ్రుద్ధికి కేటాయించడం గొప్ప విషయం. దేశంపట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ కు నిదర్శనమన్నారు బండి సంజయ్‌.

Health Tips: వయసు పెరిగే కొద్ది ఈ వ్యాధులు రావొచ్చు..కొన్ని నియమాలు పాటించండి

సామాన్యుడి మొదలు.. రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంది. కోటి కుటుంబాలకుపైగాట ఇంటి అవసరాలను తీర్చేలా, 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించేలా బడ్జెట్ లో ప్రతిపాదించడం సంతోషంగా ఉంది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1 లక్షా 50 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించడం ద్వారా రైతులపట్ల, వ్యవసాయం రంగంపట్ల మోడీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది. వ్యవసాయ పరిశోధనలకు పుట్టిల్లుగా ఉన్న తెలంగాణకు ఈసారి బాగా మేలు జరగబోతోంది. విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించి పెద్దపీట వేయడం జరిగింది. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేయడం గొప్ప విషయం. 4 కోట్ల మందికి మేలు కలిగేలా ట్యాక్స్స్ శ్లాబులను రూపొందించాం.

Vulture Population: భారత్‌లో క్షీణించిన రాబందుల జనాభా.. మనుషుల అకాల మరణాలతో లింక్..

తెలంగాణకు మొండి చేయి చూపారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం. వారి అవగాహనారాహిత్యానికి నిదర్శనం. దేశంలో తెలంగాణసహా వెనుకబడిన 150 జిల్లాల అభివ్రుద్ధికి కేంద్రం నిధులు కేటాయించబోతోంది. శాఖల వారీగా బడ్జెట్ లో ఈ అంశంపై స్పష్టత వస్తుది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే రాష్ట్ర పునర్ విభజన చట్టంలో పొందుపర్చింది ఆనాటి యూపీఏ ప్రభుత్వమైతే…దానికి వంతపాడింది కేసీఆర్ అనే విషయం వాస్తవం కాదా? దీనిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని తేల్చేన మాట వాస్తవం కాదా? కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తీరుతుందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పదేళ్లలో ఏ సాధించారో సమాధానం చెప్పాలి.

CJI: నీట్-యూజీపై విచారణ.. సీజేఐతో వాగ్వాదానికి దిగిన న్యాయవాది..అసలేమైందంటే..?

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పొందుపర్చిన యూపీఏ సర్కార్, వంతపాడిన కేసీఆర్ లు… తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలనే అంశాన్ని ఎందుకు ఆ చట్టంలో ప్రస్తావించలేదో సమాధానం చెప్పాలి. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు మీడియా ప్రకటనలకే తప్ప పరిమితమయ్యారే తప్ప కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం కనీస ప్రయత్నం చేయలేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కూడా ఉద్దేశపూర్వకంగానే సమర్పించలేదు. వీళ్లా జాతీయ హోదా గురించి మాట్లాడేది? వరంగల్ లో టెక్స్ టైల్ పార్కును ఎన్నడో ప్రకటించడంతోపాటు నిధులు కేటాయించిన తరువాత మళ్లీ దీనిపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. హైదరాబాద్ నుండి బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లో భాగంగా తెలంగాణలోని 210 కి.మీల భాగం ఉంది. అందులో కేసీఆర్ దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా పరిధి ఎక్కువగా ఉన్న సోయి కూడా ఆ పార్టీ నేతలు మర్చిపోయినట్లున్నారు. రైల్వే వోరాలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసిన సంగతిని మర్చి కోచ్ ఫ్యాక్టరీని ప్రస్తావించడం సిగ్గు చేటు.

ఇవేకాదు… తెలంగాణలో రైల్వే, రోడ్ల నిర్మాణాలతోపాటు ఇతర రంగాల అభివ్రుద్ధికి కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చింది. వివిధ శాఖల వారీగా బడ్జెట్ పూర్తి కేటాయింపుల తరువాత వాస్తవాలు ప్రజల ముందుంచుతాం. అబద్దాలు, దొంగ హామీలతో పబ్బం గడపాలనుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పిన సంగతిని మర్చిపోయి కేంద్రంపై విషం కక్కుడం ఆ పార్టీల దిగజారుడు తనానికి నిదర్శనం. ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని, తెలంగాణ అభివ్రుద్ధి విషయంలో కేంద్ర సహకారంపై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయా పార్టీల నేతలకు సూచిస్తున్నాం.’ అని బండి సంజయ్‌ అన్నారు.

NEET: నీట్ రీ-ఎగ్జామ్ ఉండదు.. పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..