Bandi Ramesh : మల్కాజ్గిరి పార్లమెంటు సీటును మరోసారి గెలిపించి సీఎంకి కానుకగా ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అలాంటి మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటును మరోసారి గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు., మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బోయిన్‌పల్లిలోని జయలక్ష్మి గార్డెన్స్ లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలంటే అభివృద్ధి కుంటు పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజులోనే కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి 159 ఎకరాల కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ఒప్పించడం గొప్ప విషయం అన్నారు.
ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను మూడు నెలల్లోనే అమలు చేయడం గొప్ప విషయం అన్నారు. హైదరాబాద్ నగరం నాలుగు వైపులా విస్తరించాల్సి ఉందని అందుకోసం మల్కాజ్గిరి వైపు ఐటీ కంపెనీలతోపాటు మల్టిలెవెల్ ఫ్లై ఓవర్లు మెట్రో రైలు రావలసిన అవసరం ఉందన్నారు. 38 లక్షల ఓటర్లు ఉన్న మల్కాజి గిరి పార్లమెంటు సీటు గెలవాలంటే కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు కావాలంటే ఖచ్చితంగా రాష్ట్రం నుంచి ముందుగా గెలవాల్సిన సీటు మల్కాజ్ గిరి అన్నారు అలాగే పార్టీలో పనిచేసే కార్యకర్తలు అందరిని గుర్తించి పార్టీ పరంగా ప్రభుత్వపరంగా తగిన గుర్తింపునివ్వాలని రాష్ట్ర నాయకత్వానికి బండిరమేష్ సూచించారు.
Also Read
తాజావార్తలు
-
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్‌చాట్’’ యాప్‌పై కేంద్రం చర్యలు..
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
-
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
-
Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!