ప్రపంచంలో అరటికి మంచి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. అందుకే మన దేశం అరటిని సాగు చేయడంలో మొదటి స్థానంలో ఉంది.. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను అరటి ముందు స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 5 వ స్థానంలో 150 వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. ఉత్పాదకతలో 21 లక్ష టన్నులతో 16వ స్థానంలో ఉంది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, తూర్పుగోదావరి, వైజాక్, కృష్ణా, శ్రీకాకుళం,వరంగల్ మొదలగు జిల్లాల్లో అరటిని ఎక్కువగా పండిస్తున్నారు.. నిజానికి ఈ అరటి 70 రకాల వరకు ఉన్నాయి.. కానీ మనం దేశంలో 12 రకాలుగా పండిస్తున్నారు.. ఓ నాలుగు రకాల గురించి తెలుసుకుందాం..
కర్పూర చక్కెర కేలి..
దేశంలో 70% అరటి ఉత్పత్తి ఈ రకానిదే దీని గెలలు పెద్దవిగా 15 కేజీ బరువుండును. గెలకు 130-175 కాయలుండి 10-12 హస్తాలతో ఉండును. 12 నెలల్లో వంట వస్తుంది.. తేలిక నేలల్లో పండటమే కాదు వర్షాలను, తెగుళ్లను కూడా తట్టుకోగలదు..
తెల్ల చక్కెర కేళి..
ఈ రకం ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలో సాగులో ఉంది. ఆకులో అంచులు పైకి తిరిగి ఉండటం ఈ. రకం ప్రత్యేకత గెల చిన్నగా ఉండి 6-8 కేజీల తూగుతుంది. ఒక గెలలో 5-6 హస్తాలతో 60-80 కాయలు కల్గిండును. 12 నెలల్లో వంట కోతకు వచ్చును. పనామ తెగులును తట్టుకుంటుంది… ఈ రకం కేవలం కోస్తాకు మాత్రమే పరిమితం..
అమృత పాణి లేదా రసాలి..
ఇది పొడవు కాయ రకం. 13-14 నెలల్లో పంటకు వచ్చును. గెల 15-20 కేజీ బరువుండి 8-10 హస్తాలతో 80-100 కాయలు కలిగి ఉండును. ఎక్కువ కాలం నిల్వ చేయుటకు పనికి రాదు. పండిన వెంటనే గెలల నుండి పండ్లు రాలిపోతాయి.. కొన్ని రకాల తెగుళ్లు కూడా వస్తాయి.. తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి..
ప్రవర్థనం..
ఈ రకం అరటిని పిలకలు, టిష్యుకల్చర్ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొత్తగా అరటి తోట వేయుటకు 3 నెలల వయసు గల అరటి పిలకలను తెగుళు లేని తల్లి చెట్టు నుండి ఎన్నుకోవాలి. సూది మొన ఆకులు గల పిలకలను నాటుటకు ఎన్నుకోవాలి. ఇవి అతి త్వరగా పెరిగి తక్కువ వ్యవధిలో పంటనిచ్చును. పిలకల దుంపలపై గల పాత వేర్లను తీసివేయాలి.. ఇది చాలా డిమాండ్ కలిగిన రకం.. ఇవే కాక మరికొన్ని రకాలను పండిస్తున్నారు..