బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇవాళ ఎదుర్కోళ్లు, రేపు ఎల్లమ్మ కళ్యాణం, బుధవారం రథోత్సవం జరగనుంది. 15 లక్షల మంది భక్తులు హాజరవుతారనే అంచనా నేపథ్యంలో 2 రోజులు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్రీన్ల్యాండ్, అమీర్పేట సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎల్లమ్మ దేవాలయం మీదుగా కాకుండా ఇతర రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది. బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా నేడు (సోమ), మంగళవారాల్లో ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. గ్రీన్ ల్యాండ్, మాతా ఆలయం, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను SRనగర్ టీ జంక్షన్ నుంచి SRనగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష్ టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్డు, శ్రీరాంనగర్ క్రాస్ రోడ్డు, ఫతేనగర్ రోడ్డులోకి మళ్లిస్తారని పేర్కొన్నారు.
దాని మళ్లింపు ఇలా..
గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్, ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలను ఎస్సార్‌నగర్ టీ జంక్షన్ వద్ద ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాషా టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్, శ్రీరామ నగర్ క్రాస్ రోడ్, సనత్ నగర్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇక ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను కట్ట మైసమ్మ దేవాలయం, బేగంపేట వైపు మళ్లించనున్నారు. ఇక గ్రీన్‌ల్యాండ్స్, బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట్ వైపు వెళ్లే వాహనదారులను ఫుడ్ వరల్డ్ క్రాస్ రోడ్ వద్ద సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రీవనం, ఎస్సార్ నగర్ టీ జంక్షన్ వైపు మళ్లించనున్నట్లు చెప్పారు పోలీసులు.
అలాగే బేగంపేట, కట్ట మైసమ్మ దేవాలయం వైపు నుంచి బల్కంపేట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను గ్రీన్‌ల్యాండ్స్, మాతా దేవాలయం, సత్యం థియేటర్, ఎస్సార్ నగర్ ట జంక్షన్, ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లింపు చేపట్టనున్నారు. ఇక ఎస్సార్‌నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్, బల్కంపేట్ వైపు వచ్చే ట్రాఫిక్ కోసం బై-లేన్లు, లింక్ రోడ్లు మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి తమకు సహకరించాలని కోరారు.
Also Read : Hardeep Singh Nijjar: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హతం.. కెనడాలో కాల్చివేత..