దళితులపై సీఎం రేవంత్ రెడ్డి వివక్ష చూపించారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ ను సీఎం అవమానించారని, రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ విషయం పై దళిత సంఘాలు స్పందించాలని, భట్టి విక్రమార్క కు కనీస బాధ్యత లేదా..దీనిపై ఆయన ఏమి చెబుతారన్నారు బాల్క సుమన్. కేబినెట్ లో ఉన్న దళిత మంత్రులు ఎందుకు నోరు తెరవడం లేదని, దళిత జాతి రేవంత్ రెడ్డి ని క్షమించదన్నారు. దళితులకు న్యాయం చేసింది బీఆర్‌ఎస్ పార్టీ నే అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ మాటలన్నీ బూటకమేనని, వారికి లొంగని వారిపైకి ఈడీ ని పంపుతుందన్నారు.
కేసీఆర్ కట్టిన సచివాలయంలో రేవంత్ ఎలా కూర్చుంటున్నడని.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. తెలంగాణలో కేసీఆర్ గుర్తులను చెరిపేస్తామని రేవంత్ అన్నారని.. కాళేశ్వరం నీళ్లను రైతులకు అందకుండా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. భేషరతుగా రేవంత్ దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. సీఎం ఫ్యూడల్‌మైండ్ సెట్‌తో ఉన్నారని.. డిప్యూటీ సీఎం భట్టి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు.
భట్టికి చిన్నపీట వేసినా మౌనంగా ఉన్నారని.. అంబేద్కర్ రిజర్వేషన్లతోనే భట్టి డిప్యూటీ సీఎంగా అయ్యారన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి కించపరిచారన్నారు. రాష్ట్రంలో దళిత సంఘాలు, మేధావులు స్పందించాలన్నారు. గతంలో అనేక విషయాలపై స్పందించిన లౌకికవాదులు, మేధావులు నోరు విప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని.. నయా దేశ్‌ముఖ్‌లాగా రేవంత్ వ్యవహరిస్తున్నారన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద కనీసం పరిసరాలను శుభ్రం చేయలేదన్నారు.