సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలు చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు వసూళ్ల పరంగాను అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూఫ్ చేసింది జైలర్.
Also Read : KantaraChapter1 : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న కాంతార చాఫ్టర్ 1
కాగా ఇప్పుడు ఈ జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్. ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించబోతున్నడని ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. ఈ కోసం బాలయ్య ఏకంగా రూ. 50 కోట్లు తీసుకున్నాడని తమిళ మీడియా కోడై కూసింది. ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఓ క్యామియోలో 20 నిముషాలు కనిపిస్తాడని టాక్ వినిపించింది. కానీ ఇప్ప్పుడు ఈ సినిమా నుండి బాలయ్య బయటకు వచ్చినట్టు చెన్నై వర్గాల టాక్. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 తో పాటు గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నాడు. మరో వారం రోజుల్లో గోపీచంద్ సినిమా స్టార్ట్ కాబోతుంది. మరి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలనో మరే ఇతర కారణం తెలియలేదు కానీ జైలర్ 2లో బాలయ్య నటించడం లేదు. దాంతో ఈ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫజిల్‌ను తీసుకున్నాడట నెల్సన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న జైలర్ 2 ను సన్ పిచ్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
