Site icon NTV Telugu

Hyderabad : ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహన దారుడు బలి..

Hyderabad News

Hyderabad News

బాలనగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహన దారుడు మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో ద్విచక్రవాహన దారుడు అదుపుతప్పి కింద పడ్డ పడ్డాడు. ఆ వ్యక్తి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అని రోడ్డుపై ఇతర వాహన దారులు ధర్నాకు దిగారు. దీంతో బాల నగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు నిరసన కారులను చెదరగొడుతున్నారు.

READ MORE: Amaravati: భూసమీకరణకు కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. మ‌రో 44 వేల ఎక‌రాల భూస‌మీక‌ర‌ణ!?

ఈ ఘటనపై తాజాగా బాలనగర్ అడిషనల్ డీసీపీ హనుమంతరావు స్పందించారు. “IDPL చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తున్నారు.. జోష్ బాబు అనే వ్యక్తి బండి పై వెళ్తుండగా అక్కడ ప్రమాదం జరిగింది.. ప్రమాదంపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతాము.. అన్ని కేసు లాగే ఈ కేసును కూడా విచారిస్తాము.. కానిస్టేబుల్ నిర్లక్ష్యం ఉంటే కచ్చితంగా అక్కడ దొరికిన ఆధారాలతో చర్యలు తీసుకుంటాం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాం.. అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్ ను పరిశీలిస్తున్నాము..” అని డీసీపీ వెల్లడించారు.

READ MORE: Pawan Kalyan: మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సీఎం

 

Exit mobile version