NTV Telugu Site icon

Unstoppable 2 : 24గంట్లో వన్ మిలియన్ వ్యూస్.. బాలయ్య సెన్సేషన్

New Project (6)

New Project (6)

Unstoppable 2 : బాలయ్య ‘అన్‌స్టాప‌బుల్‌’ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఒక్క రోజులో మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ రికార్డుల పరంపర డిజిటల్ తెరపై కూడా కంటిన్యూ అవుతోంది. ‘ఆహా’ ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన టాక్ షో ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే’తో ఆయన డిజిటల్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఆ టాక్ షో ఐఎంబీడీలో హయ్యస్ట్ రేటెడ్ టాక్ షోగా నిలిచింది. ఇప్పుడు ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే’ సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో రికార్డుల వేట మొదలు పెట్టారు బాలయ్య బాబు. రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు లోకేష్ అతిథులుగా వచ్చారు. వీళ్ళు బాలకృష్ణకు బంధువులు కావడతో ఈ ఎపిసోడ్ పై అందరూ ఆసక్తిని కనబరిచారు.

Read Also: Billa Special Show: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ రోజు ముందే దీపావళి!

‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2’ ఫస్ట్ ఎపిసోడ్‌లో బావ, అల్లుళ్లతో బాలకృష్ణ ఫ్యామిలీ విషయాలతో పాటు పొలిటికల్ అంశాలను కూడా డిస్కస్ చేశారు. నందమూరి కుటుంబానికి, టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్ ప్రస్తావన కూడా షోలో వచ్చింది. ఎపిసోడ్‌లో సంచలనాలు ఉన్నాయని ప్రోమోతోనే క్లారిటీ ఇచ్చారు. ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2’ ఫస్ట్ ఎపిసోడ్‌కు 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆహా ఓటీటీ వెల్లడించింది. సెన్సేషనల్ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని, నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ఓటీటీ రికార్డులు తిరగరాస్తున్నారని పేర్కొంది. మరోవైపు యూట్యూబ్‌లో కూడా ప్రోమో రికార్డుల మోత మోగిస్తోంది. మూడు రోజులుగా టాప్ ట్రెండ్స్ లో ఉంది.

Read Also: Prabhas: అభిమానులకు గుడ్ న్యూస్.. డ్యూయల్ రోల్‎లో ప్రభాస్

‘అన్‌స్టాప‌బుల్‌ 2’లో ఒక ఎపిసోడ్‌లో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ సందడి చేయనున్నారు. వీళ్ళిద్దరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అది విడుదల విడుదల అయ్యేది త్వరలో ప్రకటించనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన టీజర్, ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంది.

Show comments