Billa Special Show: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ రోజు ముందే దీపావళి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Billa Special Show: స్టార్ హీరోల బర్త్ డేన వాళ్ళ సినిమాను స్పెషల్ షోగా ప్రదర్శించే సంప్రదాయం ఒకటి ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. ఆ సందర్భంగా అతనితో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేంద్ర నిర్మించిన ‘బిల్లా’ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ప్రదర్శించబోతున్నారు. జపాన్ తో మొదలు పెట్టి ఈ సినిమాను ఆ రోజు వివిధ దేశాల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపారు. ఈ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ”ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక ఒరిజినల్ కథ చెప్పాను. దానికి బడ్జెట్ తక్కువ అవుతుంది. అలాగే తమిళ ‘బిల్లా’ రీమేక్ చేద్దామనీ అనుకున్నాను. దీనికి ఖర్చు ఎక్కువ, అయితే ఇండియన్ స్క్రీన్ మీద స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ రూపొందిద్దామని చెప్పాను. ప్రభాస్ తక్కువ బడ్జెట్ కథ ఎందుకు ‘బిల్లా’నే చేద్దాం ఫిక్స్ చేయి డార్లింగ్’ అన్నారు. అలా ‘బిల్లా’ను గోపీకృష్ణా మూవీస్ పతాకంపై ప్రారంభించాం. ఈ సినిమా కోసం మేము అనుకున్నదానికంటే ఎక్కువ సపోర్ట్ చేశారు కృష్ణంరాజు గారు. రెండు హెలికాప్టర్ లు అడిగితే నాలుగు తెప్పిద్దాం అనేవారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం కార్లు కొన్నాం. కార్లను స్మాష్ చేశాం. ఈ చిత్రంలో కృష్ణంరాజు గారు నటించాలనే ఆలోచన ప్రభాస్ దే. పెదనాన్న నేనూ కలిసి నటించాలనేది ఫ్యాన్స్ కోరిక డార్లింగ్ అని అన్నాడు. అలా ఆయనతో క్యారెక్టర్ చేయించాం. వాస్తవానికి ఈ 4కే షోను ఆయన ముఖ్య అతిథిగా పిలిచి ప్రదర్శించాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ కృష్ణంరాజు గారు మనకు దూరమయ్యారు. ఈ సినిమాను కేవలం నాలుగున్నర నెలల్లో షూట్ చేసి రిలీజ్ చేశాం. ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం మరో ఆకర్షణ అయ్యింది. సో ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్ షోస్ వేస్తున్నాం. కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ దీపావళి ఓ రోజు ముందు వస్తున్నట్టు” అని అన్నారు.

Also Read
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
Read Also: Mega154: అటు ‘వాల్తేరు వీరయ్య’.. ఇటు ‘వైజాగ్ రంగరాజు’ ఫ్యాన్స్‌కు పూనకాలే..
సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ, ”ఈ సినిమా సంగీతం సాధించిన విజయం మీ అందరికీ తెలిసిందే. ‘బిల్లా’ వంద రోజుల తర్వాత తమిళంలో హీరో విజయ్ తో ఓ సినిమా చేసేందుకు వెళ్లాను. కథ విన్నాక మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడని అడిగితే, మీ ‘బిల్లా’ పాటలన్నీ మాకు ఇచ్చేయండి ఈ సినిమాలో పెట్టుకుంటాం అన్నారు. ‘బిల్లా’ పాటల క్రేజ్ అలాంటిది” అని చెప్పారు. కృష్ణంరాజు కుమార్తె ప్రసీద మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో మాకెన్నో మెమొరీస్ ఉన్నాయి. గోపీకృష్ణా మూవీస్ లో డాడీ, అన్నయ్య కలిసి నటించిన చిత్రంగా మాకెంతో స్పెషల్ ఈ మూవీ. మా మనసుకు దగ్గరైన సినిమా. అన్నయ్య బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రీ-రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను యూకే ఇండియా డయోబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కు ఇవ్వబోతున్నాం. నాన్నగారు ఈ ఫౌండేషన్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా షుగర్ వ్యాధి తీవ్రమైన రోగులకు చికిత్స అందిస్తున్నాం. మేము ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని తెలిపింది.
గోపీకృష్ణ మూవీస్ లో నటించే ఛాన్స్ ఎక్కడ మిస్ అవుతానో అని అనుకుంటూ ఉండేవాడినని, అలాంటి సమయంలో తిరిగి కొంత గ్యాప్ తర్వాత ‘బిల్లా’ సినిమాను నిర్మించి, అందులో నటించే ఛాన్స్ తనకు కల్పించారని అలీ చెప్పారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ”ప్రభాస్ గారి ఇమేజ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇలాంటి సమయంలో వరల్డ్ వైడ్ గా ‘బిల్లా’ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణంరాజు గారి కీర్తి ప్రతిష్టల్ని ప్రభాస్, ప్రసీద ఆయన ఇతర కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాను” అని అన్నారు. ‘బిల్లా’ సినిమా షూటింగ్ నాటి ముచ్చట్లను ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సుబ్బరాజు కూడా తలుచుకున్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!