NTV Telugu Site icon

Bala Krishna: బాలయ్య దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి

Bala Krishana

Bala Krishana

Bala Krishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో మరోమారు బాక్సాఫీస్ ముందు గర్జించారు. రిలీజైన అన్ని థియేటర్లలో అభిమానులు ఆయన యాక్టింగ్, డైలాగులకు ఈలలుగోలలతో సందడి చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య ఉగాది సెంటిమెంట్‌గా తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టరులో ఫుల్‌ మాస్‌ లుక్‌తో బాలయ్య అదిరిపోయారు. మీసం మెలేసి గడ్డంతో చెవికి పోగు, చేతికి టాటూతో బాలకృష్ణలో మరో మాస్ యాంగిల్‌లో కనిపిస్తున్నారు. గతంలో ‘నిప్పురవ్వ’ సినిమా టైంని పోల్చి చూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు బాలయ్య ఒకేలా కనిపిస్తున్నాడంటూ తెగ సంబరపడిపోతున్నారు.

Read Also: Bhola Shankar: మెగాభిమానులకు చిరంజీవి ఉగాది కానుక.. నెక్ట్స్ మూవీ అప్ డేట్

ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అన్న దిగిండు..ఈసారి ఊహకు మించి అంటూ తన కామెంట్‌ని షేర్ చేస్తూ అనీల్‌రావిపూడి ఫోటోలను సోషల్ మీడియా గ్రూప్స్‌లో షేర్ చేశాడు. దిస్ టైమ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనే నాలుగు పదాల్ని వేరు వేరుగా ఫోటోపై పెట్టడంపై NBK108మూవీపై మరింత క్యూరియాసిటీ పెంచారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా పూర్తైయింది. రెండో షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది.

Read Also: Ugadi wishes: ‘శోభకృత్‌’లో శుభాలు కలగాలి.. రాజకీయ, సినీ ప్రముఖులు ఉగాది శుభాకాంక్షలు

సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరొయిన్ గా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత కాజల్ సైన్ చేసిన పూర్తి స్థాయి బిగ్ బడ్జెట్ మూవీ ఇదే. మరో హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య, కాజల్ అగర్వాల్ కూతురు పాత్రలో నటిస్తోంది. ఈమె పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జైలు వెళ్లొచ్చిన తండ్రి కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కున్నట్టు సమాచారం.


balakrishna anil ravipudi combination movie first look release as ugadi festival gift