Balakrishna’s NBK 109 Teaser Update: ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్‌లను అందుకున్నారు. భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ విజయాలతో బాలయ్య బాబు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే జోష్‌లో ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీతో నటసింహ తన 109వ సినిమాని చేస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా విభిన్నమైన యాక్షన్, ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను ఇవ్వనున్నట్లు సమాచారం.
నందమూరి బాలకృష్ణ, బాబీ సినిమా అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా టీజర్ మార్చి 8న రానుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి డైరెక్టర్ బాబీ సస్పెన్స్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు. హీరోయిన్, రిలీజ్ విషయంలో మాత్రమే కాకుండా.. బాలయ్య పాత్ర విషయంలో బాబీ సీక్రెట్‌ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సీక్రెట్స్ అన్నీ రివీల్ అవుతాయా అం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ ద్వారా అని తెలిసిపోయే అవకాశం ఉంది.
Also Read: Sharwanand Birthday: శర్వానంద్ బర్త్ డే.. 35వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
బాలయ్య 109 సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి నటిస్తున్నట్లు తెలుస్తోంది. దుల్కర్ ర్‌కి జోడీగా చాందిని కనిపించబోతుందట. దుల్కర్, చాందిని మధ్య కొన్ని సీన్స్ కూడా ఇప్పటికే షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ ఊటీలో జరిగింది. దాదాపు 20 రోజులు పాటు జరిగిన ఆ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించినట్లు బాబీ తెలిపారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికలు దగ్గర పడడంతో బాలయ్య బాబు షూటింగ్‌కి అప్పుడపుడు విరామం ఇస్తున్నారు.