శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు , అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గత సంవత్సరం డిసెంబర్ 2న విడుదలైన నటసింహ నందమూరి బాలకృష్ణ, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ' అనూహ్య విజయం సాధించింది. నిజానికి ఓ దశాబ్దమో, లేదా రెండు దశాబ్దాలో, లేక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు... ఇలా ఓ సంపూర్ణ సంఖ్య పూర్తి చేసుకున్న చిత్రాల గురించి ప్రస్తావిస్తూ ఉంటాం.