Site icon NTV Telugu

Sanjay Raut: శివసేన నేత సంజయ్‌ రౌత్‌కు ఊరట.. 3 నెలల తర్వాత ఎట్టకేలకు బెయిల్

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: ఉద్ధవ్‌ వర్గానికి చెందిన శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. పత్రాచల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రౌత్‌ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. బెయిల్ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని అక్టోబర్ 21న రిజర్వ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు కావడానికి ముందు, రాజ్యసభ ఎంపీ రెండుసార్లు ఈడీ సమన్లను దాటవేశారు.రాజకీయ పగతో తనపై తప్పుడు కేసు పెట్టారని రౌత్ ఆరోపించారు.ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాల మధ్య సేన నియంత్రణ కోసం తీవ్ర వాగ్వివాదం మధ్య రాజ్యసభ ఎంపీ అరెస్టు జరిగింది.

రౌత్ నిర్దోషి అయితే అతనిపై కేంద్ర ఏజెన్సీ దర్యాప్తుకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అరెస్టు తర్వాత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. సంజయ్‌ రౌత్‌ అరెస్ట్‌ అనంతరం మద్దతుదారులు భారీ నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రతీకార ఆరోపణలను ఈడీ తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో సంజయ్‌ రౌత్‌ ప్రమేయం ఉందని పేర్కొంది.

MP K.Laxman : కేంద్ర సహకారంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు

పత్రాచల్‌ భూకుంభకోణంతో సంజయ్ రౌత్, ఆయన సతీమణి వర్షా రౌత్ సహా మరికొంతమందికి సంబంధం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది. ఈ క్రమంలోనే వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్ల విలువచేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణం కేసుకు సంబంధించి రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.

Exit mobile version