తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో.. 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగం పై చర్చ జరగనుంది. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరుఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొ్న్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, హరీష్ రావు.. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివ రావు పాల్గొన్నారు.
Read Also: Harish Rao: గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచింది..
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తాము ఎవరిని బీఏసీ సమావేశం నుండి వెళ్ళమని చెప్పలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకు బీఏసీ.. బీఆర్ఎస్ నుండి ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇద్దరు ఎవరో నిర్ణయం తీసుకోండి అన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుండి కేసీఆర్.. కడియం పేర్లు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ రావడం లేదు కాబట్టి.. తాను వస్తా అని హరీష్ రావు అన్నారన్నారు.
Read Also: BAC Meeting issue: బీఏసీ సమావేశానికి హరీశ్ రావు.. మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం
ఒక సభ్యుడు రావడం లేదని ఇంకో సభ్యున్ని అనుమతివ్వరని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఒకరి బదులు ఇంకొకరు రావడం ఉండదన్నారు. బీఆర్ఎస్ నుండి ఎలాంటి లేఖ రాలేదు.. ఎన్ని రోజులైనా సభ నడుపుతామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.