ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. ఈ సినిమా మూడు వారాల క్రితం థియేటర్ లో విడుదల అయింది.ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమా గా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అద్భుతమైన కథ మరియు కథనం తో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా రూ.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా 100 కోట్ల మార్క్ దాటుతుంది అందరూ అనుకున్నారు. కానీ ఇంతలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా విడుదల అయింది.దీనితో బేబీ సినిమాకి కలెక్షన్స్ తగ్గాయి.బేబీ సినిమా వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం కోసం మేకర్స్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బేబీ కోసం మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సందడి చేయడానికి కొత్త సన్నివేశాలను ను యాడ్ చేస్తున్నారని సమాచారం..
సినిమా ను రీ ఎడిట్ చేసి పది నిమిషాలు అన్ వాంటెడ్ సీన్స్ ను తొలగించి కొత్త సన్నివేశాలను దాదాపుగా 15 నుండి 20 నిమిషాల పాటు యాడ్ చేయబోతున్నట్లు సమాచారం.ఈ యాడ్ చేసిన సన్నీవేశాల కోసం కచ్చితంగా కొత్త ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇప్పటికే సినిమా ను చూసిన వారు మళ్లీ థియేటర్లకు వస్తారని తెలుస్తుంది.ఈ సినిమాకు రెండు నుంచి మూడు రోజుల పాటు సాలిడ్ కలెక్షన్స్ నమోదు అయితే కనుక వంద కోట్ల క్లబ్ లో సినిమా జాయిన్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. కొత్త సన్నివేశాలు కూడా యూత్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని యాడ్ చేయబోతున్నట్లు సమాచారం.మరీ ఆ సీన్స్ తో బేబీ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో చూడాలి.