నవమాసాలు మోసిన తల్లికి బిడ్డలు భారం అవుతున్నారు. కంటికి రెప్పలా కాడాపాల్సిన తండ్రి పిల్లల పోషణ భారం అవుతుందని అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టేస్తున్నారు. వారం వ్యవధిలో ఇద్దరు తల్లులు తమ పిల్లలను 2 లక్షలకు విక్రయించారు. డబ్బుల పంపకాల్లో తేడాతో ఓ కేసు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. స్థానికుల సమాచారంతో మరో పసికందు విక్రయం వెలుగు చూసింది. ఈ రెండు కేసుల్లో 9 మందిని అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో పసిపిల్లల విక్రయం జోరుగా సాగుతోంది. వారం వ్యవధిలో ఇద్దరు పసి పిల్లలను అంగట్లో సరుకులా విక్రయించారు. స్థానికుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ పిల్లలను స్వాధీనం చేసుకుని పిల్లలను విక్రయించిన తల్లిదండ్రులతో పాటు కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.
Also Read:Cyber Gang Arrest: ఒక్క క్లిక్‌తో అకౌంట్లో ఉన్న డబ్బంతా ఊడ్చేస్తారు..
నిజామాబాద్ మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ముత్యాలమ్మ-వెంకట్ దంపతులకు ఐదో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇప్పటికే వారికి ఇద్దరు ఆడపిల్లతో పాటు ఇద్దరు మగ పిల్లలు ఉండటంతో మరో ఆడపిల్లను పోషించే స్థోమత లేక.. పసికందును అమ్మకానికి పెట్టారు ఆ తల్లిదండ్రులు. ఐదు రోజుల పసికందును మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఓ జంట కొనుగోలు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో శిశు సంక్షేమ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పసికందు జాడ కోసం గాలించి స్వాధీనం చేసుకున్నారు. ఆడపిల్లను పోషించే స్థోమత లేక దత్తతకు ఇచ్చామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Also Read:Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు
నిజామాబాద్ నాగారం క్వార్టర్స్‌కు చెందిన నజీర్ దంపతులకు మూడు రోజుల క్రితం ఓ పండంటి పాప జన్మించింది. పుట్టిన మూడు రోజులకు ఆ బిడ్డను 2 లక్షలకు బేరం పెట్టారు. లక్ష రూపాయలు చెల్లించి బిడ్డను తీసుకెళ్లిపోయారు కొనుగోలుదారులు. మిగతా లక్ష కోసం వివాదం తలెత్తగా బిడ్డను విక్రయించిన విషయం బయటకు పొక్కింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పసికందు విక్రయంపై కూపీ లాగారు. పసికందు కోనుగోలు చేసిన తల్లిదండ్రులతో పాటు విక్రయించిన వారిపై కేసు నమోదు చేశారు. బిడ్డను రెస్క్యూ చేసి బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు.
Also Read:Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు
మూడు రోజుల వ్యవధిలో ఇలా ఇద్దరు పసికందుల విక్రయించారని పోలీసులు తెలిపారు. 2 లక్షల రూపాయలకు పసిపిల్లలను విక్రయించగా.. వారిని పట్టుకుని కేసులు నమోదు చేశామన్నారు నిజామాబాద్ వన్ టౌన్ సీఐ. పిల్లలను చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలని అక్రమంగా కొనుగోలు చేస్తే.. కేసుల పాలవుతారని చెబుతున్నారు.
Also Read:Siddipet Murder: బీమా డబ్బుల కోసం సొంత అత్తకే స్పాట్..
కామారెడ్డి జిల్లాలో ఆడపిల్ల పుట్టిందని.. అప్పుడే పుట్టిన పసికందును వదిలించుకున్నారు. ముక్కుపచ్చలారని ఓ పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. బిచ్కుంద మండలం పెద్ద దేవాడ-పుల్కల్ వంతెన వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. వంతెన వద్ద నవజాత శిశువు ఏడుపులు విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పసికందును స్వాధీనం చేసుకున్న పోలీసులు బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స అందించి.. కామారెడ్డి శిశు గృహకు తరలించారు. బ్రిడ్జి వద్ద పసికందును ఎవరు వదిలి వెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read:Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు
మూడు రోజుల వ్యవధిలో ఓ ఆడపిల్లను 2 లక్షలకు ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. మరో తల్లి పేగు బంధాన్ని రోడ్డుపై వదిలేసింది. మరో బిడ్డను కాసుల కోసం అమ్మేసింది కన్న తల్లి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మూడు ఘటనలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.