Russia-Ukraine War: ప్రసూతి ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి!.. శిశువు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని విల్నియాన్స్క్ నగరంలోని ప్రసూతి ఆసుపత్రిపై బుధవారం రష్యా క్షిపణి దాడిలో నవజాత శిశువు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ప్రసవించిన మహిళ, శిశువు, డాక్టర్ రెండస్తుల భవనంలోని ప్రసూతి వార్డులో ఉందని.. ఆ వార్డు మొత్తం ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో డాక్టర్, తల్లి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని.. కానీ శిశువు మరణించిందని వెల్లడించారు. రాత్రి ఆ ప్రాంతంలో పొగ దృశ్యాలతో పాటు సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ సిబ్బంది ఫోటోలు వెలువడ్డాయని టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ పేర్కొంది.
US VISA: యూఎస్‌ను సందర్శించాలంటే వీసా కోసం1000 రోజులు ఆగాల్సిందే..!
Also Read
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం పోస్ట్ చేసిన వీడియోలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది వైద్యుడిలా కనిపించిన వ్యక్తికి తాగేందుకు నీరు ఇస్తున్నట్లు చూపబడింది. ఈ క్షిపణి దాడిపై విల్నియాన్స్క్‌తో సహా జాపోరిజ్జియా ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ స్టారుఖ్ టెలిగ్రామ్‌లో స్పందించారు. ఈ దాడి వల్ల అప్పుడే పుట్టిన పసిగుడ్డు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రష్యా ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్ టెలిగ్రామ్ పోస్ట్‌లో దాడిని ఖండించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యా దళాలను ఉగ్రవాదులుగా ప్రస్తావిస్తూ.. ప్రతి ఉక్రేనియన్ జీవితానికి రష్యా బాధ్యత వహిస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!