మరో మూడు రోజుల్లో మొదలు కాబోయే టి20 ప్రపంచ కప్ సన్నహంగా పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్లు నాలుగు టి20 సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. ప్రస్తుతం మూడు మ్యాచులు సంబంధించి వరణుడు రెండు మ్యాచ్లకు ఆటంకం కలిగించగా.. మొదటి మ్యాచ్, మూడో మ్యాచ్ రద్దు కాగా.. రెండో టి20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఇకపోతే మంగళవారం నాడు జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ కు ముందు ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వైరల్ గా మారిన వీడియోలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజం తన అభిమానులతో కాస్త కోపద్రికుడైనట్లు కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విశేషాలు చూస్తే..
Elephant Calf Rescued: 30 అడుగుల బావిలో పడిపోయిన ఏనుగు పిల్ల.. 11 గంటల పోరాటం తర్వాత..
బాబర్ అజం మ్యాచ్ ఆగిపోవడంతో ఇంగ్లాండులోని వీధుల్లో సరదాగా తిరిగేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అతనిని తమ దేశ అభిమానులు చుట్టుముటారు. సెల్ఫీ వీడియోలు, ఫోటోలు కావాలంటూ అందుగుతుండడంతో.. సహనం కోల్పోయిన ఆయన తన ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకి రెండు నిమిషాలు సమయం ఇస్తారా.. అంటూ గట్టిగా అరిచేసాడు. అదే సమయంలో ఫ్యాన్స్ కాస్త దూరంగా ఉండాలంటూ వారిని రిక్వెస్ట్ చేశాడు.
Sudheer Babu Wife: ఇప్పుడిలా ఉన్న మహేష్ బాబు చెల్లి.. అప్పుడు ఇలా ఉండేదా..?
దీంతో ఆయన అభిమానులు అతనికి కాస్త దూరంగా వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపు తర్వాత శాంతించిన అతను తిరిగి మళ్లీ ఫాన్స్ తో సెల్ఫీలు దిగాడు. ఆ తర్వాత అక్కడ నుంచి కారులో వెళ్లిపోయాడు. తాజా గాఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతుండగా.. మరికొందరైతే అతనికి వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని కామెంట్ చేస్తుండగా.. మరికొందరైతే అలా సహనం కోల్పోవడం తగదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Babar Azam angry on fans in Cardiff. Fans should give players some space for their personal talks. Pathetic behavior from the fans. Hats off to Babar, after all this happening still meeting with his fans happily and taking selfies.❤️🫶#BabarAzam | #BabarAzam𓃵 | #PAKvsENG pic.twitter.com/2Ttfzdw7Dr
— Salman 🇵🇰 (@SalmanAsif2007) May 28, 2024