Babar Azam: ఒకప్పుడు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్.. నేడు దిక్కుతోచని స్థితిలో బాబర్ ఆజామ్..
Babar Azam: పాకిస్థాన్ జట్టులో ఓ పేరు ఇప్పుడు చాలా మంది మాజీ క్రికెటర్లను ఇబ్బంది పెడుతోంది. ఆ మాజీ కెప్టెన్‌ను తొలగించాలని అనేక రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. ఒకప్పుడు పాకిస్థాన్ జట్టుకు సారథ్యం వహించిన ఈ ప్లేయర్‌పై ఉన్నట్టుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. బాబర్ ఆజామ్.. ఒకప్పుడు టాప్ ఆర్డర్‌లో వందలాది రన్స్ కొట్టిన బ్యాటర్.. ఇప్పుడు తన స్థానమే ఏమిటో తెలియని స్థితిలో కనిపిస్తున్నాడు. బౌండరీలు దొరకక ఇబ్బంది పడటం, కీలక మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోవడం వల్ల టీ20కి సరిపోతాడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. వాస్తవానికి.. ఒకప్పుడు 50కి పైగా సగటుతో రన్స్ చేసిన ఆటగాడిని గత ఏడాది నుంచి మేనేజ్‌మెంట్ గందరగోళంలోకి నెట్టేసింది. కొంతకాలం జట్టులో చోటు ఇవ్వలేదు. జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత స్థిరమైన పాత్ర దక్కడం లేదు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేయడంతో బాబర్ ఆజామ్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఒక బ్యాటర్‌కు స్పష్టమైన బాధ్యత లేకపోతే అతను ఎలా స్థిరంగా ఆడగలడు? ఈ అయోమయం వల్ల జట్టుకూ నష్టం, బాబర్‌కూ నష్టం జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి..
READ MORE: Oil Imports: భారత్-అమెరికా ఆయిల్ ఘర్షణలో గెలిచిన సౌదీ అరేబియా..
వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో బాబర్ ఆజామ్‌ను టాప్ 4 బ్యాట్స్‌మెన్‌గా పంపారు. ఈ నిర్ణయం పెద్ద తప్పిదంగా మారింది. టీ20ల్లో ఆ స్థానంలో బాబర్ అంతకు ముందు దాదాపు ఆడలేదు. టాప్ 3లో అలవాటు ఉన్న ప్లేయర్‌ను పూర్తిగా కొత్త స్థానంలో పెట్టడం వల్ల ఫలితం దక్కలేదు. ఏడుమ్యాచ్‌ల్లో కేవలం 185 రన్స్.. తక్కువ స్ట్రైక్ రేట్.. ఇవన్నీ ఆ నిర్ణయం ఎంత తప్పో చెప్పేస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నమీబియాతో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడినా బాబర్ బ్యాటింగ్‌కు రాలేదు. ఒకప్పుడు టాప్ ఆర్డర్‌లో ఫిక్స్ అయిన ప్లేయర్ ఇప్పుడు 5, 6 స్థానాల వరకూ వెనక్కి వెళ్లే పరిస్థితి రావడంతో పాకిస్థాన్ బాబర్‌పై నమ్మకం కోల్పోయిందా? అనే సందేహాన్ని పెంచుతోంది. అయితే ఇక్కడ ఒక సానుకూల విషయం కూడా ఉంది. బాబర్ పెద్దగా రన్స్ చేయకపోయినా పాకిస్థాన్ సూపర్ 8కు చేరింది. 2024లో సాధించలేని విషయం ఈసారి సాధించింది. కానీ ముందున్న మ్యాచ్‌లు చాలా కఠినంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో అయినా బాబర్‌కు సముచిత స్థానం కల్పిస్తారా? లేదా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..
-
Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
-
Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!
-
Xiaomi: తక్కువ బిల్లు, ఎక్కువ కంఫర్ట్.. మిజియా సూపర్ ఎనర్జీ సేవింగ్ 1HP ఏసీ విడుదల
-
Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?