Babar Azam: బాబర్ అజామ్ సంచలన నిర్ణయం!
- కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబర్
- కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో గౌరవం
- ఆటగాడిగా సహకారాన్ని అందిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam Captaincy: పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం రాత్రి ఎక్స్ వేదికగా తెలిపాడు. పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో గౌరవం అని, అయితే కెప్టెన్సీని వదులుకొని ఆటపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. టెస్టుల్లో షాన్ మసూద్ సారథిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే, టీ20ల నుంచి బాబర్ తప్పుకోవడంతో.. పీసీబీ ఎవరిని కెప్టెన్ చేస్తుందో చూడాలి.
‘నేను ఈ రోజు మీతో ఓ విషయం పంచుకుంటున్నాను. పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో గౌరవంగా ఉంది. అయితే కెప్టెన్సీని వదులుకొని నా ఆటపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్సీ గొప్ప అనుభవం. అయితే దానివల్ల పని భారం పెరుగుతోంది. ఇక నుంచి నా ఆటకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నా. నా బ్యాటింగ్‌ను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకుంటున్నా. నా విలువైన సమయాన్ని కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నా. జట్టుగా కలిసి సాధించిన దాని గురించి ఎంతో గర్వపడుతున్నాను. ఇక నుంచి ఆటగాడిగా జట్టుకు నా సహకారాన్ని అందిస్తా. ఇప్పటివరకు మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’ అని బాబర్ అజామ్ పేర్కొన్నాడు.
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
Also Read: Virat Kohli Bat: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌కు విరాట్ కోహ్లీ బ్యాట్!
2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చేయడంతో బాబర్ అజామ్‌ను పీసీబీ కెప్టెన్సీ నుంచి తప్పించింది. టీ20లకు షహీన్ అఫ్రిదిని, టెస్టులకు షాన్ మసూద్‌ను కెప్టెన్‌గా నియమించింది. అయితే అఫ్రిది నేతృత్వంలో న్యూజిలాండ్‌పై 4-1 తేడాతో సిరీస్ కోల్పోవడంతో మళ్లీ బాబర్‌కే బాధ్యతలు వచ్చాయి. బాబర్ నేతృత్వంలో టీ20 ప్రపంచకప్ 2024 ఆడిన పాక్.. ఘోర ప్రదర్శన చేసింది. భారత్‌తో సహా పసికూన యూఎస్ఏ చేతిలో ఓడిపోయింది. దీంతో కెప్టెన్ సహా జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వ్యక్తిగతంగా గొప్ప ప్రదర్శనలు చేసిన బాబర్.. ఐసీసీ టోర్నీలను మాత్రం గెలవలేకపోయాడు. బాబర్ ఇప్పటివరకు 54 టెస్టు మ్యాచ్‌ల్లో 3962 పరుగులు, 117 వన్డేల్లో 5729 పరుగులు, 123 టీ20ల్లో 4145 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!