Babar Azam Captaincy: పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం రాత్రి ఎక్స్ వేదికగా తెలిపాడు. పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో గౌరవం అని, అయితే కెప్టెన్సీని వదులుకొని ఆటపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. టెస్టుల్లో షాన్ మసూద్ సారథిగా కొనసాగుతున్న విషయం…