Pakistan vs India T20 2026: బాబర్ అజామ్ లేకుండా భారత్‌తో పాక్ మ్యాచ్? కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs India T20 2026: భారత్ – పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఇరు జట్లు కొలంబోకు చేరుకున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తమ అభిమాన స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ భారత్‌పై బాగా రాణిస్తాడని, చాలా పరుగులు చేస్తాడని అనుకుంటున్న సమయంలో వారికి గట్టి షాక్ తగిలే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. USAతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ బాబర్ 32 బంతుల్లో 143.75 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు. అయితే ఈ పాక్ బ్యాట్స్‌మెన్‌కు భారత్‌తో జరిగిన T20 మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకునే రికార్డు లేకపోవడంతో విశ్రాంతి ఇవ్వవచ్చనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. బాబర్ స్థానంలో, గత మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కని అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ ఫఖర్ జమాన్‌కు అవకాశం లభించవచ్చని చెబుతున్నారు. జమాన్‌కు T20 ఫార్మాట్‌లో బాబర్ అజామ్ కంటే మెరుగైన స్ట్రైక్ రేట్ ఉంది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
బాబర్ ఆజం భారత్‌తో మొత్తం ఐదు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌లలో 128.04 స్ట్రైక్ రేట్, 26.25 సగటుతో 105 పరుగులు చేశాడు. భారతదేశంపై అతని అత్యధిక ఇన్నింగ్స్ 68 పరుగులు, ఈ స్కోర్‌ను అతను 2021 T20 ప్రపంచ కప్‌లో నమోదు చేశాడు. ఫఖర్ జమాన్ ఆటతీరు గురించి చెప్పాలంటే, భారత్‌పై అతని రికార్డు అంతగా ఆకట్టుకోలేదు. అయితే, అతను తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో అనేక సందర్భాల్లో జట్టును విజయపథంలో నడిపించాడు. అందుకే పాకిస్థాన్ క్రికెట్ నిపుణులు, అభిమానులు అతన్ని నంబర్ నాల్గవ స్థానానికి బలమైన పోటీదారుగా భావిస్తున్నారు. ఇప్పటి ఆయన పాకిస్థాన్ తరపున 117 మ్యాచ్‌లు ఆడి 108 ఇన్నింగ్స్‌లలో 2385 పరుగులు చేశాడు.
ఉస్మాన్ తారిక్‌ను కూడా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి పాకిస్థాన్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు బ్యాట్, బంతి రెండింటితోనూ మ్యాచ్ గమనాన్ని మార్చడంలో నిష్ణాతులు. ఈ జాబితాలో సైమ్ అయూబ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్‌ల పేర్లు కూడా ఉంటాయి. వీళ్లతో పాటు ‘మిస్టరీ’ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, కెప్టెన్ అఘా సల్మాన్ కూడా అవసరమైనప్పుడు బౌలింగ్ చేయడంలో కూడా నిష్ణాతుడు. ఆర్. ప్రేమదాస స్టేడియం స్పిన్నర్లకు అనుకూలమైన స్టేడియంగా చెబుతున్నారు. అదే టైంలో ఫాస్ట్ బౌలింగ్‌కు కూడా అనుకూలించవచ్చని చెబుతున్నారు. పాకిస్థాన్ జట్టులో ఇప్పటికే స్పిన్నర్లతో కూడిన భారీ లైనప్ ఉంది. దీంతో స్టార్టింగ్ ఓవర్లను దృష్టిలో ఉంచుకుని, కోచ్, కెప్టెన్లు నసీమ్ షాతో సహా ఇద్దరు ప్రొఫెషనల్ ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Maha Shivaratri 2026: ఈ 4 రాశుల వారికి శివయ్య ఆశీస్సులు.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!